New School Uniform for Students in Andhra Pradesh | అమరావతి: ఏపీలో విద్యార్థులకు అలర్ట్.. వచ్చే విద్యా సంవత్సరం (జూన్ 12) ఆరంభం నుంచి స్కూల్ యూనిఫామ్ మారనుంది. స్కూల్ విద్యార్థులు కొత్త యూనిఫామ్‌లకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆమోదం తెలిపారు. ఏ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన రంగులు, గుర్తులు లేకుండా విద్యార్థులకు స్కూల్ యూనిఫాం రూపొందించినట్లు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్‌లో భాగంగా స్టూడెంట్లకు కూటమి ప్రభుత్వం యూనిఫామ్, బ్యాగు, బెల్ట్ అందించనుంది.
ప్రమాదానికి గురైన బాలుడి వైద్యానికి మంత్రి నారా లోకేష్ అండ
అమరావతి: అభం శుభం తెలియని చిన్నారి అనుకోకుండా ప్రమాదానికి గురవడంతో ఆ కుటుంబం ఇబ్బందులకు గురైంది. వైద్య సాయం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కోరడంతో సత్వరమే స్పందించి.. ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడుకు చెందిన కైకవరపు వెంకట్రావు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అతడి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడిపోవడంతో చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో బాలుడికి మెరుగైన వైద్యానికి సాయం అందించాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ ను విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1.52 లక్షల చెక్కు అందజేశారు. మంత్రి లోకేష్ సాయం పట్ల బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.