Holi 2025 Special Sale And Holi Offers: రంగుల పండుగ హోలీ, ఈ సంవత్సరం మార్చి 14న (శుక్రవారం) వచ్చింది, ఇంకా ఎంతో దూరంలో లేదు. ఈ పండుగ వేడుకల కోసం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రజలు ఉత్సాహంగా ఫెస్టివ్‌ షాపింగ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే, హోలీ సందర్భంగా ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ కూడా ఆఫర్లు & డిస్కౌంట్లు ప్రకటించాయి, పండుగ షాపింగ్‌పై మరింత ఉత్సాహాన్ని చిలకరించాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రలో హోలీ 2025 ప్రత్యేక సేల్ నడుస్తోంది.


ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపులు
ముందుగా ఫ్లిప్‌కార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో "బిగ్ బచత్ డేస్ సేల్" ‍‌(Flipkart Big Bachat Days Sale) ప్రారంభమైంది. దీనిలో భాగంగా, వందలాది ఉత్పత్తులపై మంచి ఆఫర్లు & గొప్ప తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్ సమయంలో మీరు "పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌" (PNB) కార్డ్‌తో షాపింగ్ చేస్తే, మీకు 10 శాతం తక్షణ తగ్గింపు (Instant discount) లభిస్తుంది.


హోలీ స్పెషల్ సేల్‌లో ఐఫోన్‌పైనా ఆఫర్‌
ఫ్లిప్‌కార్ట్ హోలీ స్పెషల్ సేల్‌లో ఐఫోన్ 16e ‍‌(iPhone 16e)పై డిస్కౌంట్‌ ఉంది. Samsung, Vivo, Nothing, IQOO ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లను కూడా ఆఫర్‌లో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌వాచ్‌లు కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ధరలకు లభిస్తాయి. "బిగ్ బచత్ డేస్ సేల్"లో ఇయర్‌బడ్‌లపై మంచి డిస్కౌంట్లు పొందవచ్చు. ఇయర్‌బడ్‌లలో 100కు పైగా ఆప్షన్స్‌ ఉన్నాయి & వాటి ప్రారంభ ధర రూ. 699.


అమెజాన్‌లో హోలీ డీల్స్
హోలీ సందర్భంగా, అమెజాన్ హోలీ స్పెషల్ సేల్‌ ‍‌(Amazon Holi Special Sale) ప్రకటించింది. ఈ ప్రత్యేక అమ్మకం కోసం అమెజాన్ ఇండియా యాప్‌లో ఒక బ్యానర్ కనిపిస్తుంది. మీరు ఆ బ్యానర్‌పై క్లిక్ చేసిన వెంటనే హోలీ ఆఫర్లు & డిస్కౌంట్లలో లిస్ట్‌ అయిన అనేక ఉత్పత్తులు వరుసగా కనిపిస్తాయి. రంగులు, పూజకు సంబంధించిన వస్తువులు, గిఫ్ట్ హాంపర్లు కూడా ఆ లిస్ట్‌లో ఉన్నాయి. అదేవిధంగా, కొన్ని ఉత్పత్తులు టైమ్ ట్యాగ్‌తో లిస్ట్‌ అయ్యాయి. కొన్ని ఉత్పత్తులు బ్యాంక్ ఆఫర్లతో రన్‌ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లపై కూడా మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హోలీ వేడుకల తర్వాత రంగులను శుభ్రం చేయడానికి క్లీనింగ్ ఉత్పత్తులు అమెజాన్ ఇండియా హోలీ ప్రత్యేక పేజీలో కనిపిస్తున్నాయి.


మింత్ర బర్త్‌డే బ్లాస్ట్ సేల్
దుస్తులను అమ్మే మింత్ర కూడా హోలీ సేల్‌ ఆఫర్లు ప్రకటించింది. మింత్ర బర్త్‌డే బ్లాస్ట్ సేల్ ‍‌(Birthday Blast Sale) కింద మహిళల ఎథ్నిక్ దుస్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. పురుషుల కాజువల్స్‌పై 55 శాతం వరకు తగ్గింపు ఉంది. హ్యాండ్‌బ్యాగులు, మేకప్ ఉపకరాణాలు, బెడ్‌షీట్లు, పాదరక్షలు కూడా ఈ స్పెషల్‌ సేల్‌లో భాగమయ్యాయి.