Scholarships 2023: ఈ కాలంలో చదువు అంటే ఆర్థిక భారం మోయాల్సిందే. చిన్న పాటి ప్రైవేటు స్కూలులో, కాలేజీలు చేర్పించినా వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే. లక్షలు లేనిది ఉన్నతవిద్య అందడం లేదు. చాలా మంది విద్యార్థులు చదువుకు అయ్యే ఖర్చుకు భయపడి మధ్యలోనే మానేస్తుంటారు. కొంత మంది చదువులో బాగా రాణించినా తదుపరి విద్య కోసం డబ్బు పెట్టే స్తోమత లేక డ్రాపవుట్స్ గా మిగిలిపోతుంటారు. అలాంటి విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించేందుకు తీసుకువచ్చినవే స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు. అర్హత, ప్రాంతం, అవసరానికి అనుగుణంగా దరఖాస్తు చేయడం ద్వారా స్కాలర్‌షిప్‌ లు పొందవచ్చు. చాలా స్కాలర్ షిప్‌లకు విద్యార్థి చదువులో ప్రతిభ కనబరచడమే అర్హత. మరికొన్ని స్కాలర్‌షిప్‌లకు చదువుతో పాటు వెనకబడిన కులాలకు చెందిన వారు అయి ఉండాలి. 9వ తరగతి నుంచి పీజీ లాంటి ఉన్నత విద్య అభ్యసించేంత వరకు రకరకాల స్కాలర్‌ షిప్ లు అందుబాటులో ఉన్నాయి. 


JM సేథియా మెరిట్ స్కాలర్‌షిప్‌ పథకం 2023


ఈ స్కాలర్ షిప్‌ను JM సేథియా ఛారిటబుల్ ట్రస్ట్ అందిస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే 9వ తరగతి నుంచి పీజీ వరకు అంటే ప్రోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రొఫెనల్ కోర్సుల విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందిస్తుంది. వారిని మొదట కేటగిరీలుగా విభజిస్తారు. స్కాలర్ షిప్ లకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. వారికి ప్రతి నెలా కెటగిరీ వారీగా డబ్బును వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తారు. 


ఈ JM సేథియా మెరిట్ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 31, 2023 చివరి తేది. ఈ స్కాలర్ షిప్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి jmitrust.com ని సందర్శించవచ్చు. ఈ స్కాలర్ షిప్‌ కు ఎంపికైన తర్వాత, కోర్సు ప్రకారం నెలకు రూ. 10 వేల రూపాయల వరకు పొందవచ్చు. సేథియా ఛారిటబుల్ చిరునామా - జేఎం సేథియా ఛారిటబుల్ ట్రస్ట్, 133, బిప్లబీ రాష్ బెహరీ బసు రోడ్డు, 3వ అంతస్తు, రూమ్ నెం.15, కోల్ కతా- 700 001


ఇమెయిల్ ఐడి - jms_trust@yahoo.in
ఫోన్ నంబర్ - (91)-33-2236-0368/67
మొబైల్ నంబర్ - (91)-93397 93153.


Also Read: Popular Earning Tips: ఈ స్కిల్స్ ఉంటే చదువుతూ రెండు చేతులా సంపాదించొచ్చు


రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్‌షిప్ 2023


ఈ రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్ షిప్ ను రామన్ కాంత్ ముంజాల్ ఫౌండేషన్ అందజేస్తోంది. ఇది ప్రధానంగా ఫైనాన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. బీబీఏ, బీఎఫ్ఐఏ, బీకామ్ (హెచ్‌ఈ), మేనేజ్‌మెంట్ స్టడీస్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌(IPM), BA(ఎకనామిక్స్), బ్యాచిలర్ ఇన్ బిజినెస్ స్టడీస్ అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. హీరో గ్రూప్ ఇనిషియేటివే ఈ రామన్ కాంత్ ముంజాల్ స్కాలర్ షిప్. 


విద్యార్థులకు తప్పనిసరిగా 10వ, 12వ తరగతుల్లో కనీసం 80 శాతం మార్కులు రావాలి. విద్యార్థి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 4 లక్షల లోపు మాత్రమే ఉండాలి. ఈ స్కాలర్ షిప్ కింద విద్యార్థులకు రూ. 40 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఏడాదికి ఇస్తారు. విద్యార్థి ఏ విద్యా సంస్థలో, ఏ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారు అనే దానిపై స్కాలర్ షిప్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ స్కాలర్ షిప్ ను మూడేళ్ల పాటు అందిస్తారు. మరిన్ని వివరాల కోసం scholarships@rkmfoundation.org కు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial