AP B Pharmacy Counselling Dates 2024: ఏపీలో ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌లో ఫార్మసీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూలును సాంకేతిక విద్యాశాఖ నవంబరు 27న ప్రకటించింది. దీనిప్రకారం ఎంపీసీ విభాగానికి చెందిన విద్యార్థులకు నవంబరు 29 నుంచి డిసెంబరు 6 వరకు, బైపీసీ విభాగానికి చెందిన విద్యార్థులకు నవంబరు 30 నుంచి డిసెంబరు 14 మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఎంపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులు నవంబరు 29 నుంచి 30 వరకు, బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులు నవంబరు 30 నుంచి డిసెంబరు 5 వరకు  ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 


ఎంపీసీ విద్యార్థులకు నవంబరు 29 నుంచి డిసెంబరు 1 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఇక బైపీసీ విద్యార్థులకు డిసెంబరు 2 నుంచి 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. ఫార్మసీలో కోర్సులు, కళాశాలల ఎంపికకు సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్‌లో నవంబరు 29 నుంచి డిసెంబరు 1 వరకు, బైపీసీ స్ట్రీమ్‌లో డిసెంబరు 3 నుంచి 7 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.


సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్న ఎంపీసీ విద్యార్థులకు డిసెంబరు 4న, బైపీసీ విద్యార్థులకు డిసెంబరు 11న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన ఎంపీసీ విద్యార్థులు డిసెంబరు 4-6 మధ్య, బైపీసీ విద్యార్థులు డిసెంబరు 11-14 మధ్య సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఎంపీసీ విద్యార్థులకు డిసెంబరు 5 నుంచి, బైపీసీ విద్యార్థులకు డిసెంబరు 12 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి.


ఫార్మసీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు.. (B Pharmacy Counselling Date 2024 In AP)


ఎంపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు..


➥ నవంబరు 29 నుంచి 30 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు. 


➥ నవంబరు 29 నుంచి డిసెంబరు 1 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్.


➥ నవంబరు 29 నుంచి డిసెంబరు 1 వరకు వెబ్‌‌ఆప్షన్ల నమోదు.


➥ డిసెంబరు 4న సీట్ల కేటాయింపు.


➥ డిసెంబరు 4-6 మధ్య సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్.


➥ డిసెంబరు 5 నుంచి తరగతులు ప్రారంభం.


బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు..


➥ నవంబరు 30 నుంచి డిసెంబరు 5 వరకు  ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 


➥  డిసెంబరు 2 నుంచి 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్.


➥  బైపీసీ స్ట్రీమ్‌లో డిసెంబరు 3 నుంచి 7 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు.


➥ డిసెంబరు 11న సీట్ల కేటాయింపు.


➥ డిసెంబరు 11-14 మధ్య సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్.


➥ డిసెంబరు 12 నుంచి తరగతులు ప్రారంభం.


ALSO READ:


తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
విద్యలో ప్రత్యేకత కలిగిన ప్రఖ్యాత మార్కెట్ పరిశోధనా సంస్థగా గుర్తింపు పొందిన సీఫోర్.. పాఠశాలల్లో ఉపాధ్యాయుల యోగ్యత, పెడగోగి & పాఠ్యాంశాల ఔచిత్యం, నాయకత్వం, పాలన, మౌలిక వసతులు, సామాజిక సమ్మిళితత వంటి క్లిష్టమైన అంశాల ఆధారంగా ఉత్తమ పాఠశాలలను ఎంపికచేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పాఠశాలలను అధ్యయనం చేసింది. తెలంగాణ నుంచి 7 స్కూల్స్ టాప్-5లో స్థానం సంపాదించాయి. ఇందులో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని CHIREC ఇంటర్నేషనల్ స్కూల్ కైవసం చేసుకుంది. ఇక మూడో స్థానంలో విద్యారణ్య హైస్కూల్, ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నిలిచాయి. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...