ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు రేపటి (జనవరి 12) నుంచే సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. వారంరోజులపాటు సంక్రాంతి సెలవులు రావడంతో పిల్లలు వారి తల్లిదండ్రులతో పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటున్నారు. దీంతో జాతీయ రహదారులు రద్దీగా మారాాయి. నగరాలు, పట్టణాలు వెలవెలబోనుండగా.. పల్లెటూళ్లు కళకళలాడనున్నాయి. ఏపీలో జనవరి 12 నుంచి జనవరి 18 వరకు సెలవులు కొనసాగనున్నాయి. పాఠశాలలు తిరిగి జనవరి 19న పున:ప్రారంభం కానున్నాయి.
ఇక జూనియర్ కళాశాలకు కూడా జనవరి 12 నుంచే సెలవులు ప్రారంభంకానున్నాయి. జనవరి 17 వరకు సెలవులు ఉంటాయి. జనవరి 18న కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెలవుల్లో తరగతులు నిర్వహించడానికి వీల్లేదని, తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు సెక్రటరీ శేషగిరిబాబు హెచ్చరించారు.
మొదట జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ.. ఉపాధ్యాయ సంఘాల నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సంక్రాంతి సెలవులు కేవలం ఆరు రోజులు మాత్రమే ఇచ్చారని, ఇవి సరిపోవని, ముఖ్యంగా 16న కనుమ పండుగ తర్వాత రోజునే స్కూళ్లకు, కాలేజీలకు రావాలంటే సొంత గ్రామాకు వెళ్లిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో ఇబ్బంది అవుతుందని తెలిపాయి. కనీసం 18వ తేదీ వరకు సెలవులు పొడిగించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వం సెలవులను జనవరి 12 నుంచి 18 వరకు ఇవ్వాలని నిర్ణయించింది.
మరోవైపు తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాలలకు 5 రోజులపాటు సెలవులు ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల సంక్రాంతి సెలవులు ఇచ్చారు. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ ఉండగా.. జనవరి 17న కూడా సెలవురోజుగా ప్రకటించారు. దీంతో జనవరి 18న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయి.
ఒక్కరోజే సెలవు..
ఇక తెలంగాణలో మాత్రం కేవలం 3 రోజులు (భోగి, సంక్రాంతి, కనుమ) మాత్రమే సెలవులు మంజూరుచేశారు. వాటిలో జనవరి 14 రెండో శనివారం కాగా, జనవరి 15 ఆదివారం వచ్చింది. అంతే విద్యార్థులకు జనవరి 16 ఒక్కరోజు మాత్రమే సెలవు ఇచ్చినట్లయింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలకు జనవరి 14 నుంచి 16 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ఇచ్చింది. తిరిగి జనవరి 17న తరగతులు పునః ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు. సెలవుల్లో జూనియర్ కాలేజీల్లో తరగతులు నిర్వహించొద్దని ఆదేశించారు. ఎక్కడైనా తరగతులు నిర్వహించినట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు, కాలేజీలకు 'సంక్రాంతి' సెలవులివే! ఏపీలో ఇలా - తెలంగాణలో అలా!
ఫిబ్రవరిలోనే ఇంటర్ ప్రాక్టికల్స్! కొత్త షెడ్యూలు ఇదే..
ఏపీలో ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మారింది. థియరీ పరీక్షలకన్నా ముందే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనుండగా.. వొకేషనల్ కోర్సులకు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలను 10 రోజుల పాటు రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది.
మారిన పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..