APRGUKT Admissions 2024: ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ప్రవేశాలు కోరేవారు మే 8న ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు. ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.


సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్‌ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందుతారు. ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు. నాలుగు క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్‌ మెరిట్‌ కింద కేటాయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివిన విద్యార్థులకు 4 % డిప్రివేషన్‌ స్కోర్‌ను జోడించి మెరిట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.  


వివరాలు..


* ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు (RGUKT AP)-2024


* ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్


క్యాంపస్‌లు: నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు.


సీట్ల సంఖ్య: 4,400.


వ్యవధి: 6 సంవత్సరాలు (పీయూసీ రెండేళ్లు, బీటెక్ నాలుగేళ్లు)


అర్హత: ఈ ఏడాది నిర్వహించిన పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా.


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.05.2024.


Notification


WEBSITE


ALSO READ:


ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, నేషనల్‌ స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్‌ సంయుక్త ఆధ్వర్యంలో 2024-2025 విద్యాసంవత్సరానికిగాను సెల్ఫ్‌ సపోర్టెడ్‌ ప్రోగ్రామ్ కింద ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 60 సీట్లను భర్తీచేస్తారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సైనిక కుటుంబాలకు చెందినవారికి ప్రాధాన్యం ఇస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1000 చెల్లించాలి. అభ్యర్థులు 'Registrar, A.U. Common Entrance Test & Admission Account' పేరిట విశాఖపట్నంలో చెల్లుబాటు అయ్యేలా ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి డిడి తీయాల్సి ఉంటుంది. సరైన అర్హతలున్నవారు జూన్ 18లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. ఎంపికైనవారికి రెండేళ్లపాటు కోర్సు నిర్వహిస్తారు.  డిఫెన్స్ పర్సనల్స్‌, డిపెండెంట్లు రూ.40,000. ఇతరులు రూ.60,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..