UGC NET 2022 Admit Card Released: యూజీసీ నెట్-డిసెంబరు (ఫేజ్-1) 2022 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు యూజీసీ నెట్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) నిర్వహించనున్నారు. మొత్తం 64 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎగ్జామ్ ఇంటిమేషన్ స్లిప్స్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.  


యూజీసీ నెట్-2022 డిసెంబరు ఫేజ్-1 అడ్మిట్ కార్డు ఇలా డౌన్‌లోడ్ ఇలా..


Step 1: అడ్మిట్ కార్డు కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. -ugcnet.nta.nic.in.


Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'UGC NET Admit card December (Phase-1) 2022' లింక్ మీద క్లిక్ చేయాలి.


Step 3: అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి లాగిన్ అవ్వాలి.


Step 4: కంప్యూటర్ స్క్రీన్ మీద అడ్మిట్ కార్డు దర్శనమిస్తుంది.


Step 5: అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.


UGC NET Admit Card 2022


Advance city intimation for UGC – NET December 2022


పరీక్షల షెడ్యూలు..



Also Read:


మేనేజ్‌మెంట్ విద్యకు సరైన మార్గం ‘మ్యాట్’, ఫిబ్రవరి 2023 నోటిఫికేషన్ విడుదల!
ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (ఏఐఎంఏ)-2023 ఫిబ్రవరి సెషన్‌ మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (MAT) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ, ఇతర ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏఐఎంఏ మ్యాట్‌ను ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహిస్తుంది. మ్యాట్ 2022 ఫిబ్రవరి నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..  


CMAT: కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇలా!
దేశ‌వ్యాప్తంగా వివిధ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల‌కు నిర్వహించే కామ‌న్ మేనేజ్‌మెంట్ అడ్మిష‌న్ టెస్ట్ (సీమ్యాట్)-2023 ప్రక‌ట‌న‌ను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఫిబ్రవరి 13న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశాలకు 'జెట్' - నోటిఫికేషన్ వెల్లడి, వివరాలు ఇలా!
పుణెలోని ఫిల్మ్ & టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌టీఐఐ), కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా- జాయింట్ఎంట్రన్స్ టెస్ట్(జెట్) 2022-2023 నోటిఫికేషన్ విడుదల చేశాయి. దీనిద్వారా అర్హులైన అభ్యర్థులు ఫిల్మ్, టెలివిజన్  విభాగాల్లో పీజీ డిప్లొమా, యూజీ సర్టిఫికెట్, పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రవేశ పరీక్షను ఎ,బి,సి గ్రూప్‌ల వారీగా నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒక్కో గ్రూప్  నుంచి ఒక కోర్సు చొప్పున గరిష్ఠంగా మూడు కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..