పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికిగాను నిర్వహించే వివిధ రెగ్యులర్ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం సెప్టెంబరు 2న బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఎంఏ కమ్యూనికేషన్  జర్నలిజం కోర్సులకు; అదేవిధంగా సెప్టెంబరు 3న బ్యాచిలర్  ఇన్  లైబ్రరీ సైన్స్, ఎంఏ తెలుగు కోర్సులకు ప్రశేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మొదటి సెషన్‌లో, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.


Also Read: JoSAA 2022 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!



ప్రవేశపరీక్ష ఫలితాలను సెప్టెంబరు 5న విడుదల చేయనున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి సెప్టెంబరు 8, 9వ తేదీల్లో కోర్సులో చేరడానికి కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను ఆగస్టు 31 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వర్సిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్  చేసుకోవాలన్నారు.


పరీక్ష కేంద్రం: పొ.శ్రీ.తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్సు, హైదరాబాద్.



హాల్‌టికెట్ల కోసం వెబ్‌సైట్:  www.pstucet.org


 


Also Read:  PJTSAU: అగ్రికల్చర్ బీఎస్సీ ప్రవేశ ప్రకటన, దరఖాస్తు ఇలా!


 


పరీక్షల షెడ్యూలు ఇలా..


* పరీక్ష తేదీ: 02-09-2022


కోర్సు పేరు: బీఎఫ్‌ఏ, ఎంఏ (కమ్యూనికేషన్ & జర్నలిజం).


* పరీక్ష తేదీ: 03-09-2022


కోర్సు పేరు: బీఎల్ఐఎస్సీ, ఎంఏ తెలుగు.



కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..


ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే కౌన్సెలింగ్ తేదీలను కూడా వర్సిటీ ప్రకటించింది. దీనిప్రకారం సెప్టెంబరు 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.



  • సెప్టెంబరు 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీఎఫ్‌ఏ ( బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) కోర్సు కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంఏ (కమ్యూనికేషన్ & జర్నలిజం) కోర్సు కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.


  • సెప్టెంబరు 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీఎల్ఐఎస్సీ కోర్సు కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంఏ (తెలుగు) కోర్సు కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.


కౌన్సెలింగ్ కేంద్రం: పొ.శ్రీ.తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్సు, హైదరాబాద్.


ప్రాయోగిక పరీక్షలు ఎప్పుడంటే?


బీఎఫ్‌ఏ ( బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) విద్యార్థులకు సెప్టెంబరు 2న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రాయోగిక పరీక్షలు నిర్వహిస్తారు.




Also Read: KNRUHS: పీజీ డెంట‌ల్ సీట్ల భ‌ర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!

Also Read: DOST Admissions: దోస్త్‌ రెండో విడత సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..