ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులతో మాట్లాడారు. భారతదేశం విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి సరైన దిశలో పయనిస్తోందని అన్నారు. 2020లో ప్రారంభించిన కొత్త జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ప్రధాని మోదీ అన్నారు.


"జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడంలో మా ఉపాధ్యాయులు పెద్ద పాత్ర పోషించారు. యువ హృదయాలను ఆవిష్కరించినందుకు ఉపాధ్యాయులకు మేము కృతజ్ఞతలు" అని ప్రధాని మోదీని చెప్పారు.


1986లో రూపొందించిన జాతీయ విద్యా విధానం స్థానంలో 2020లో కొత్త విద్యావిధానాన్ని కేంద్రం తీసుకొచ్చిది. పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థల్లో పరివర్తన సంస్కరణలకు మార్గం సుగమం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.


"భారతదేశం బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 250 ఏళ్లుగా మనల్ని పరిపాలించిన వారిని వెనక్కి నెట్టి ఈ స్థానాన్ని సాధించడం ప్రత్యేకం" అని ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు.


ఈ సందర్భంగానే కొత్త పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని 14,500 బడులను పునరుద్ధరించేందుకు ప్రధానమంత్రి స్కూల్‌ ఫర్‌ రైజింగ్ ఇండియా పేరుతో స్కీం తీసుకొచ్చారు. నూతన విద్యావిధానం స్ఫూర్తితో ఈ పాఠశాలల అభివృద్ధి జరుగుతుందన్నారు. 






శ్రీ పథకంలో బాగు చేసే స్కూల్స్‌లో విద్యా వ్యవస్థను మార్చేలా మార్పులు ఉంటాయన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. విద్య మాత్రమే కాకుండా ఆటలపై కూడా ఈ స్కూల్స్‌లో ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. స్మార్ట్ క్లాస్ రూమ్స్‌ తీసుకురానున్నారు. ఇది భవిష్యత్‌లో లక్షల  మంది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ. 


ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయులకు 2022 జాతీయ అవార్డులను అందజేశారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఎంపికైన 46 మంది ఉపాధ్యాయులు ఈ బహుమతిని అందుకున్నారు.


ఈ కార్యక్రమంలో కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలలో పంజాబ్‌లోని మాన్సా జిల్లాలోని దాతేవాస్ గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ హెడ్‌మాస్టర్ 39 ఏళ్ల అరుణ్ కుమార్ గార్గ్ కూడా ఉన్నారు. అతను కోవిడ్-19 మహమ్మారి సమయంలో గణితంలో పంజాబీ పాఠాలను ఉచితంగా అందించడానికి "అభ్యాస్ బై అరుణ్ సర్" యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించాడు.


గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలోని నవ నడిసర్ ప్రాత్మిక్ శాల ప్రిన్సిపాల్ రాకేష్ పటేల్ కూడా తన కార్యక్రమాల ద్వారా మొత్తం సమాజానికి పరివర్తన తెచ్చిన అవార్డును అందుకున్నారు.


ఉపాధ్యాయులకు జాతీయ అవార్డుల ఉద్దేశ్యం ఏమిటంటే, తమ నిబద్ధత మరియు కృషి ద్వారా పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా వారి విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేసిన దేశంలోని అత్యుత్తమ ఉపాధ్యాయుల విశిష్ట సహకారాన్ని జరుపుకోవడం గౌరవించడం అని ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక  ప్రకటన విడుదల చేసింది.


ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు ప్రజల గుర్తింపును అందిస్తాయి. ఈ సంవత్సరం అవార్డు కోసం, దేశవ్యాప్తంగా 45 మంది ఉపాధ్యాయులను కఠినమైన, పారదర్శకమైన ఆన్‌లైన్‌లో మూడు దశల ప్రక్రియ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపింది.