Stock Market Closing Bell 5 September 2022: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ఓపెన్ అయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty), నిఫ్టీ బ్యాంక్ (Nifty Bank) ఆ స్థాయి నుంచి ఇక కిందకు దిగలేదు. ఉదయం తొలి గంటలో బలమైన కొనుగోళ్లు కనిపించాయి. ఇంధన సరఫరా సమస్యలు పెరిగిపోవడంతో, మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) యూరప్ మార్కెట్లు దాదాపు 1 శాతం పైగా నష్టాల్లో ఓపెన్ అయినా, మన మార్కెట్లు లెక్క కూడా చేయలేదు. ఉనికి చాటుకోవడానికి బేర్స్ అప్పుడప్పుడు ప్రయత్నించినా ఫలించలేదు. మార్కెట్ ఆద్యంతం బుల్ పట్టు నడిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 7 పైసలు పెరిగి 79.78 వద్ద ఉంది.
BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 58,803 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇవాళ (సోమవారం) 58,814 వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. 58,812 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,308 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 442 పాయింట్లు లేదా 0.75 శాతం లాభంతో 59,245 వద్ద ముగిసింది.
NSE Nifty
శుక్రవారం 17,539 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ 17,546 వద్ద ఫ్లాట్‌గా ఓపెనైంది. 17,540 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,683 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా, 126 పాయింట్లు లేదా 0.72 శాతం లాభంతో 17,665 వద్ద క్లోజైంది. గత కొన్ని సెషన్లుగా, 17,700 స్థాయి వద్ద ఈ ఇండెక్స్ గట్టి రెసిస్టెన్స్‌ను ఎదుర్కొంటోంది. ఇవాళ, దాదాపు అదే స్థాయికి వెళ్లి క్లోజయింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ కూడా లాభాల్లో ముగిసింది. ఉదయం 39,412 వద్ద మొదలైన ఈ ఇండెక్స్, 39,407 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,865 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 384 పాయింట్లు లేదా 0.98% లాభంతో 39,805 వద్ద స్థిరపడింది. 39,800 స్థాయిలో దీనికి అడ్డంకి ఉంది.
Gainers and Lossers
నిఫ్టీ50లో 35 కంపెనీలు లాభాల్లో, 15 నష్టాల్లో ముగిశాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌టీపీసీ, ఐటీసీ, సన్‌ఫార్మా టాప్-5 గెయినర్లు. నెస్టెల్ ఇండియా, బజాజ్ ఆటో, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్ టాప్-5 లూజర్స్. అన్ని సెక్టోరియల్ ఇండీసెస్ పచ్చరంగులోనే ముగిశాయి. నిఫ్టీ మీడియా 2.75 శాతం, నిఫ్టీ మెటల్ 1.67 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 1.12 శాతం పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.