PHTI: పీహెచ్‌టీఐ- ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్(ఏఎంఈ) & బీఎస్సీ(ఏరోనాటిక్స్) కంబైన్డ్ కోర్సులో ప్రవేశాలు

పీహెచ్‌టీఐ 2023-24 విద్యా సంవత్సరానికి ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (ఏఎంఈ) & బీఎస్సీ(ఏరోనాటిక్స్) కంబైన్డ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

ముంబయిలోని పవన్ హన్స్ హెలికాప్టర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ 2023-24 విద్యా సంవత్సరానికి ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ (ఏఎంఈ) & బీఎస్సీ(ఏరోనాటిక్స్) కంబైన్డ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్/ ఏరోనాటికల్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు తమ దరఖాస్తులను జులై 28 వరకు సంబంధిత చిరునామాకు పంపించాలి. 

Continues below advertisement

కోర్సు వివరాలు..

* ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్(ఏఎంఈ) & బీఎస్సీ (ఏరోనాటిక్స్)

కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు.

సెమిస్టర్లు: ఆరు.

అర్హత: కనీసం 45 శాతం మార్కులతో 12వ తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) లేదా డిప్లొమా(మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఏరోనాటికల్) ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 28.07.2023.

Notification 

Website

ALSO READ:

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్‌ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్‌ విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి ఉన్నవారు జూన్ 27 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను ఎన్టీఏ తర్వాత ప్రకటించనుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

9వ తరగతి నుంచి పీజీ వరకు స్కాలర్‌షిప్‌లు, నెలకు ఎంతవస్తుందో తెలుసా?
ఈ కాలంలో చదువు అంటే ఆర్థిక భారం మోయాల్సిందే. చిన్న పాటి ప్రైవేటు స్కూలులో, కాలేజీలు చేర్పించినా వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే. లక్షలు లేనిది ఉన్నతవిద్య అందడం లేదు. చాలా మంది విద్యార్థులు చదువుకు అయ్యే ఖర్చుకు భయపడి మధ్యలోనే మానేస్తుంటారు. కొంత మంది చదువులో బాగా రాణించినా తదుపరి విద్య కోసం డబ్బు పెట్టే స్తోమత లేక డ్రాపవుట్స్ గా మిగిలిపోతుంటారు. అలాంటి విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహించేందుకు తీసుకువచ్చినవే స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు. అర్హత, ప్రాంతం, అవసరానికి అనుగుణంగా దరఖాస్తు చేయడం ద్వారా స్కాలర్‌షిప్‌ లు పొందవచ్చు. చాలా స్కాలర్ షిప్‌లకు విద్యార్థి చదువులో ప్రతిభ కనబరచడమే అర్హత. మరికొన్ని స్కాలర్‌షిప్‌లకు చదువుతో పాటు వెనకబడిన కులాలకు చెందిన వారు అయి ఉండాలి. 9వ తరగతి నుంచి పీజీ లాంటి ఉన్నత విద్య అభ్యసించేంత వరకు రకరకాల స్కాలర్‌ షిప్ లు అందుబాటులో ఉన్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

దటీజ్ తెలంగాణ, దేశంలో 43 శాతం కొత్త MBBS సీట్లు మనవే- గర్వంగా ఉందన్న హరీష్ రావు
వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని వేల కొత్త సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అరుదైన ఘనత సాధించింది. 2023- 24 అకడమిక్ ఇయర్ నుంచి దేశ వ్యాప్తంగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన మెడికల్ సీట్లలో 43 శాతం సీట్లు తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీలవే అయినందుకు చాలా గర్వంగా ఉందన్నారు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement
Sponsored Links by Taboola