ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ప్రొఫెసర్ రామిరెడ్డి దూరవిద్య కేంద్రం (ఓయూసీడీఈ) ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.900 చెల్లించి జులై 28 నుంచి ఆగస్టు 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా కోర్సు్ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
* ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు
1) ఎంబీఏ
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
2) ఎంసీఏ
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ స్థాయిలో మ్యాథమెటిక్స్ ఒక సబ్జె్క్టుగా ఉండాలి. అయితే డిగ్రీలో మ్యాథమెటిక్స్ చదవనివారు ఇంటర్ స్థాయిలో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.900
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయిం. వీటిలో సెక్షన్-ఎ అనలిటికల్ ఎబిలిటి-35 ప్రశ్నలు-35 మార్కులు, సెక్షన్-బి మ్యాథమెటిక్స్ ఎబిలిటి-40 ప్రశ్నలు-40 మార్కులు, సెక్షన్-సి కమ్యూనికేషన్ ఎబిలిటి 25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.07.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.08.2023.
➥ రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 18.08.2023.
ALSO READ:
ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు అభ్యర్థుల మెరిట్ జాబితాను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 26న విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన నీట్-యూజీ పరీక్షలో రాష్ట్రానికి చెందిన 44,629 మంది అర్హత పొందారు. వీరిలో 22,167 మంది కన్వీనర్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 15,016 అమ్మాయిలు ఉండగా 7,151 మంది అబ్బాయిలు ఉన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
నల్సార్ యూనివర్సిటీలో ఎంఏ&అడ్వాన్స్‌డ్ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దూరవిద్య విధానంలో 2023-2024 విద్యా సంవత్సరానికి ఎంఏ, అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నాలుగు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహణ!
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2023-24వ సంవత్సరానికి సంబంధించిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్ షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ప్రకటించింది. ఆల్‌ఇండియా కోటా కింద మెడికల్ కాలేజీల్లోని 50 శాతం సీట్లతో పాటు డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎండీ, ఎంఎస్, డిప్లొమా, పీజీ డీఎన్‌బీ, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మొత్తం 4 రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. నీట్ పీజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. డీమ్డ్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునేవారు రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..