విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విదేశీ వైద్య విద్యార్థుల (ఎఫ్ఎంజీ) మెడికల్ ఇంటర్న్‌షిప్ కౌన్సెలింగ్‌ను ఏప్రిల్ 20న నిర్వహించనున్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఎఫ్‌ఎంజీలు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 18 వరకు అవకాశం కల్పించారు. జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) సూచనల మేరకు ఏప్రిల్ 15 వరకు మార్కుల జాబితాలు అందే అవకాశం ఉన్న నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు చేశారు.


విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులు దేశంలో ఏడాదిపాటు విధిగా చేయాల్సిన మెడికల్ ఇంటర్న్‌షిప్ కోసం కౌన్సెలింగ్ నిర్వహించి, సీట్లను కేటాయించి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేసే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు జాతీయ వైద్య మండలి(ఎంసీఐ) అప్పగించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ అక్కడి వైద్య మండళ్లే ఈ బాధ్యత నిర్వహించనున్నాయి. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ త్వరలో ఇంటర్న్‌షిప్ అడ్మిషన్లకు ఉత్తర్వులు తాజాగా జారీచేసింది.


విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారి ప్రాధాన్యాల మేరకు వైద్య కశాశాలల్లో సీట్లను కేటాయించనున్నారు. గతంలో ఇలాంటి వైద్య విద్యార్థులు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా వంటి వైద్యకళాశాలల్లోనే అత్యధికంగా చేరేవారు. ఇతర ప్రాంతాలు లేదా జిల్లాల్లోని వైద్య కళాశాలల పట్ల ఒకరిద్దరు కూడా ఆసక్తి చూపేవారు కారు. ఈ నేపథ్యంలో జాతీయ వైద్య మండలి(ఎంసీఐ) రాష్ట్రంలోని వైద్య కళాశాలల వారీగా సీట్లను కేటాయించింది. ప్రధానంగా కొత్త వైద్య కళాశాలలకు ఎక్కువ సీట్లు కేటాయించారు. వాటిలోనే సీట్లను ముందుగా భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని 19 ప్రభుత్వ, 25 ప్రైవేటు కళాశాలలకు 1,884 ఇంటర్న్‌షిప్ సీట్లను కేటాయించారు.


పారామెడికల్‌ సీట్ల భర్తీకి మార్చి 21న కౌన్సెలింగ్‌
కాకతీయ మెడికల్ కాలేజీ పరిధిలో 2022-23 విద్యాసంవత్సరానికి వివిధ పారామెడికల్ కోర్సుల్లో ఖాళీగా ఉన్న 114 సీట్ల భర్తీకి మార్చి 21న ఉదయం 9 గంటలకు కేఎంసీ ఆడిటోరియంలో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్‌దాసు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వివిధ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ తెలిపారు.


Also Read:


పాలిటెక్నిక్ ఫెయిలైన వాళ్లకు గుడ్ న్యూస్, ఇప్పుడు పరీక్ష రాసి పాస్‌ కావొచ్చు - 1990 నుంచి ఇప్పటిదాకా!
రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ఇంత వరకు పాస్‌ కాలేకపోయిన వారికి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్‌ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇలాంటి వారికి ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ సీ శ్రీనాథ్‌ మార్చి 8న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించడానికి ఏప్రిల్‌ 10 చివరితేదీగా నిర్ణయించారు. ఇక రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 14 వరకు, తత్కాల్‌ స్కీం కింద ఎగ్జామ్‌ ఫీజుతో పాటు మరో రూ.6,000 అదనంగా కలిపి ఏప్రిల్‌ 15 వరకు చెల్లించడానికి అవకాశం కల్పించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


'నిట్‌'లో ఎంసీఏ ప్రవేశానికి 'నిమ్‌సెట్', నోటిఫికేషన్ వెల్లడి!
దేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్‌)లలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (నిమ్‌సెట్) -2023' నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా... వరంగల్, అగర్తలా, అలహాబాద్, భోపాల్, కాలికట్, దుర్గాపూర్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశాలు ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి నిట్-జంషెడ్‌పూర్ పరీక్ష బాధ్యతలు చేపట్టింది. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..