రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ఇంత వరకు పాస్‌ కాలేకపోయిన వారికి ప్రభుత్వం తీపికబురు వినిపించింది. 1990 నుంచి ఇప్పటి వరకు ఫెయిల్‌ అయిన వారికి ప్రత్యేక పరీక్షను నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇలాంటి వారికి ఈ ఏడాది జూన్‌లో పరీక్షలు నిర్వహిస్తామని సాంకేతిక విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ సీ శ్రీనాథ్‌ మార్చి 8న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించడానికి ఏప్రిల్‌ 10 చివరితేదీగా నిర్ణయించారు. ఇక రూ.400 ఆలస్య రుసుముతో ఏప్రిల్‌ 14 వరకు, తత్కాల్‌ స్కీం కింద ఎగ్జామ్‌ ఫీజుతో పాటు మరో రూ.6,000 అదనంగా కలిపి ఏప్రిల్‌ 15 వరకు చెల్లించడానికి అవకాశం కల్పించారు.


అలాగే అభ్యర్థులు ఇండస్ట్రియల్‌ అసెస్‌మెంట్‌ ఫీజుగా రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. మూడేండ్ల వ్యవధి గల ఈ కోర్సును గరిష్టంగా 6 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిలబస్‌ను మార్చడంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునే అవకాశం లభించడం లేదు. అయితే, కొన్నిసార్లు మానవతా దృక్పథంతో ప్రభుత్వం ప్రత్యేక అనుమతినిస్తుంది. ఇలా ఈ సారి 1990 నుంచి 2018 వరకు గల అభ్యర్థులు ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు పరీక్షలు రాసుకునే అవకాశానిచ్చారు. 
మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపు..


పాలిటెక్నిక్ ఫెయిల్ అయినవారికి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపునిచ్చారు. 1990 నుంచి పాస్‌ కాలేకపోయిన వారి సంఖ్య 1000కి పైగే ఉంది. ఒక విద్యార్థి 12 సబ్జెక్టులు ఫెయిలైతే.. సంబంధిత అభ్యర్థి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపు పొంది 9 సబ్జెక్టులకు పరీక్షలు రాసేందుకు వీలుంటుంది. ఇలా ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్‌ అయితే వాటి నుంచి మూడు సబ్జెక్టుల నుంచి మినహాయింపునిస్తారు. ఎవరైనా ఒకరు నాలుగు సబ్జెక్టులు ఫెయిలైన పక్షంలో ఇప్పుడు మూడింటి నుంచి మినహాయింపు పొంది ఒక సబ్జెక్టుకు పరీక్షరాసి పాస్ అయితే సరిపోతుంది.


Also Read:


సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం, పరీక్ష తేదీలివే!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG) 2023 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అయితే గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులు లేవని యూజీసీ ఛైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని ఆశ్రయించి cuet.samarth.ac.in లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


ప్రైవేటు విద్యాసంస్థల్లో ‘విద్యా హక్కు’ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
 ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం ప్రవేశాలకు మార్చి 4న నోటిఫికేషన్ వెలువడింది. ప్రైవేటు పాఠశాలలు మార్చి 6 నుంచి 16 వరకు ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులు 18 నుంచి ఏప్రిల్ 7లోపు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశాలకు అర్హత పొందిన విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 9 నుంచి 12 వరకు జరుగనుంది. మొదటి జాబితాను ఏప్రిల్ 13న విడుదల చేయనున్నారు.
ప్రవేశ ప్రకటన, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


'నిట్‌'లో ఎంసీఏ ప్రవేశానికి 'నిమ్‌సెట్', నోటిఫికేషన్ వెల్లడి!
దేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్‌)లలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (నిమ్‌సెట్) -2023' నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా... వరంగల్, అగర్తలా, అలహాబాద్, భోపాల్, కాలికట్, దుర్గాపూర్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశాలు ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి నిట్-జంషెడ్‌పూర్ పరీక్ష బాధ్యతలు చేపట్టింది. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..