ఏపీలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఫార్మాటివ్-2 పరీక్షల్లో లీకేజీల పర్వం కొనసాగుతోంది. విద్యార్థుల సామర్థ్యాలను మదింపు చేసేందుకు నిర్వహించాల్సిన పరీక్షలు మొక్కుబడిగా మారాయి. పరీక్ష ప్రశ్నపత్రాల ముద్రణకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పాఠశాల విద్యాశాఖ వాట్సప్‌లో ప్రశ్నపత్రాలను పంపిస్తోంది. ఎంఈఓలు, ఉపాధ్యాయులకు పంపుతున్న ప్రశ్నపత్రాలు రోజూ లీక్ అవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి.
విద్యార్థులు ఉదయమే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ప్రశ్నపత్రాలను చూసి, ఆ ప్రశ్నలు చదువుకుని పరీక్షలు రాసేస్తున్నారు. దీంతో కష్టపడి చదువుకున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పరీక్షల వ్యవస్థ పక్కదారి పట్టింది.
ప్రశ్నార్థకంగా పరీక్షల నిర్వహణ..
విద్యాశాఖకు వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ప్రశ్నపత్రాల ముద్రణకు రూ.2 కోట్లు వెచ్చించలేకపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఫార్మాటివ్-2 పరీక్షల నిర్వహణనే ప్రశ్నార్థకంగా మార్చింది. విద్యాహక్కు చట్టం-2009లో భాగంగా సీసీఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో 2013 నుంచి ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు. ఏడాదికి నాలుగుసార్లు ఫార్మాటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి పాఠశాల స్థాయిలోనే ప్రశ్నపత్రాలను రూపొందించుకోవాలి. గతంలో అలాగే చేసేవారు. ఇప్పుడు వీటికీ రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రాన్ని అందిస్తున్నారు. అయితే, ప్రశ్నపత్రాల ముద్రణకు నిధులివ్వకుండా వాట్సప్‌లో పంపడంతో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి.
ALSO READ:
ఏపీలో 11 రోజుల దసరా సెలవులు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే? తెలంగాణలో రెండు రోజులు ఎక్కువే!
ఏపీలోని పాఠశాలలకు ఈ సారి 11 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కు అక్టోబరు 14 నుంచి 24 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే రాష్ట్రంలో అక్టోబరు 3 నుంచి 6 వరకు నిర్వహించాల్సిన ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలను అక్టోబరు 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష నమూనాలో చేసిన మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసమే తేదీల మార్పులు చేశామని అధికారులు తెలిపారు. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, 2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 1 నుంచి అక్టోబరు 7 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్) లేదా పోస్ట్ బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు అయిదేళ్ల పని అనుభవం ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..