ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేయాలంటూ గత రెండు రోజులుగా ఓయూలో విద్యార్థులు చేసిన ఆందోళనపై స్పందించిన యూనిర్సిటీ సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ప్రకటన విడుదల చేసింది. ఓయూ పరిధిలోని అన్ని రకాల పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ఒక ప్రకటనలో తెలిపారు.


అన్ని పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలను ఆగస్టు 22 నుంచి నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల రీత్యా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీఓఈ చెప్పారు. పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు తమ వెబ్‌సైట్‌లో  చూసుకోవచ్చని సూచించారు. 

కారణమిదేనా?
ఆర్ఆర్ బీ, కానిస్టేబుల్ పరీక్షల సమయంలో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేశారు. ఎంతో కాలంగా ఉద్యోగ అవకాశాలు లేక కష్టపడ్డామని.. తీరా ఇప్పుడు అవకాశాలు ముంగిటకు వచ్చాక సెమిస్టర్ పరీక్షలు పెడితే ఎలా అని విద్యార్థులు ప్రశ్నించారు. తమ ఉద్యోగ అవకాశాలను కాలరాసే విధంగా సెమిస్టర్ పరీక్షలను నిర్వహించవద్దని డిమాండ్ చేస్తూ నిన్న అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న ఓయూ అధికారులు సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. తిరిగి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తేదీల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. 


Also Read: ‘మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు, చివరితేది ఇదే!

KNRUHS: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాల విడుదల
MBBS ఫైనలియర్‌ పరీక్షల ఫలితాలను కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఆగస్టు 10న ప్రకటించింది. మొత్తం 2,807 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వై.మల్లేశ్వర్‌ ఆగస్టు 10న ఒక ప్రకటనలో తెలిపారు. 2022 మే నెలలో జరిగిన ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం (పార్ట్‌–2) పరీక్షల్లో మొత్తం 92.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. వీరిలో 34 మంది డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులు కాగా 1034 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణిలో నిలిచారని పేర్కొన్నారు. ఫలితాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in లో చూడాలని సూచించారు.


Also Read: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!


నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఉపాధి కల్పన వయోపరిమితి పెంపు!!
ఉపాధి కల్పన కార్యాలయాల్లో 54 ఏళ్ల వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ మేరకు ఉపాధి కల్పన కార్యాలయాల ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్ల నమోదుకు జీవో నం.193 (27.06.1994)లో ప్రభుత్వం సవరణలు చేసింది.


14 నుంచి 54 ఏళ్లలోపు వారికి ఛాన్స్ 
తాజా సవరణల ప్రకారం.. గతంలో ఉపాధి కల్పన కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు జులై 1 నాటికి 14 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వయసు ఉండాలి. తాజా సవరణ మేరకు పుట్టిన తేదీ నాటికి 14 నుంచి 54 ఏళ్లలోపు ఉండాలి.


రెన్యూవల్ లేకుండా పర్మినెంట్‌గా 
ఒకసారి పేరు నమోదు చేసుకున్న తరువాత ప్రతి మూడేళ్లకోసారి పేరును రిజిస్టరులో పునరుద్ధరించుకోవాల్సి వచ్చేది. ఇక నుంచి పుట్టిన తేదీ ప్రామాణికంగా 54 ఏళ్లు వచ్చే వరకు ఆ అభ్యర్థి పేరు, ఉపాధికార్డు రిజిస్టరులో కొనసాగుతుంది.


ఉపాధి కల్పన కార్డులో పేర్కొన్న తేదీన కార్డును పునరుద్ధరించుకోవాలి. పునరుద్ధరణకు ఏడాది గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అభ్యర్థికి 54 ఏళ్లు దాటిన తరువాత ప్రతి మూడేళ్ల కోసారి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు కార్డును పునరుద్ధరించుకోవచ్చు. 65 ఏళ్లు దాటిన వెంటనే అభ్యర్థిపేరు ఉపాధి కల్పన లైవ్ రిజిస్టరు నుంచి తొలగిస్తారు.


నిరుద్యోగ  యువతకు  ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వారికి సహాయం చేయడానికి జిల్లా ఉపాధి కల్పన శాఖలు  పని చేస్తాయి. వారి విద్యార్హతలు, వయస్సు, కులం మరియు నమోదు సీనియారిటీల ఆధారంగాఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయబడతాయి.


అన్ లైన్ రిజిస్ట్రేషన్:
జనవరి నుంచి 2018 వరకు ఉపాధి రిజిస్ట్రేషన్లు మరియు పునరుద్ధరణలు అదనపు అర్హతలుతో ఆన్లైన్ పోర్టల్లో మాత్రమే పనిచేయును.


Also Read: పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?


ఎక్స్ఛేంజ్ కార్యకలాపాలు :



  1. రిజిస్ట్రేషన్, ఆన్ లైన్ లో ఉద్యోగ కార్డుల పునరుద్ధరణ మరియు నిర్వహణ (www.employment.telangana.gov.in).

  2. నిరుద్యోగులైన యువతమరియు సంస్థల డేటా నిర్వహణ.

  3. నిరుద్యోగ యువతకు మరియు విద్యార్థులకు వృత్తి మార్గదర్శకత్వం ఇవ్వడం.

  4. ఉద్యోగ మెలాస్ నిర్వహించడం మరియు ప్రైవేటు రంగంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించడం.

  5. PMKVY కేంద్రాలతో సహా పాఠశాలలు మరియు కళాశాలల్లో కెరీర్ చర్చలు నిర్వహించడం.

  6. PMKVY కేంద్రాల ప్రాథమిక ధృవీకరణ మరియు PMKVY సెంటర్ తనిఖీ.


Website


GUIDELINES TO EMPLOYMENT EXCHANGES IN TELANGANA


 


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..