శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్ గ్లోబల్‌గా లాంచ్ అయింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఫోల్డబుల్ లైనప్‌లో ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కంపెనీ మంచి కెమెరాలను అందించింది. అండర్ డిస్‌ప్లే కెమెరాను ఈ స్మార్ట్ ఫోన్‌లో చూడవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ధర
ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799.99 డాలర్లుగా (సుమారు రూ.1,42,700) ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలు కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బీజ్, గ్రేగ్రీన్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్.కాం వెబ్‌సైట్లో ఎక్స్‌క్లూజివ్‌గా బర్గండీ కలర్ ఆప్షన్ కూడా ఉంది.


శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్పెసిఫికేషన్లు
ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ 12ఎస్ ఆధారిత వన్ యూఐ 4.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయిన మొదటి ఫోన్ ఇదే. 7.6 అంగుళాల డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను ప్రధాన స్క్రీన్‌గా అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 21.6:18గా ఉంది. కవర్ డిస్‌ప్లేగా 6.2 అంగుళాల హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను శాంసంగ్ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 23.1:9గా ఉంది.


క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. వన్ యూఐ సాఫ్ట్ వేర్ ద్వారా మల్టీ టాస్కింగ్‌కు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అందించారు.


ఈ స్మార్ట్ ఫోన్‌లో మొత్తంగా ఐదు కెమెరాలు ఉన్నాయి. ఒకటి కవర్ డిస్‌ప్లే పైన,  ఒకటి మెయిన్ స్క్రీన్ పైన అండర్ డిస్‌ప్లేలో అందించగా, వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఫోన్ వెనక ఉన్న కెమెరాల్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ అందించారు. మెయిన్ స్క్రీన్ మీద 4 మెగాపిక్సెల్, కవర్ డిస్‌ప్లేపై 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


5జీ, 4జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.63 సెంటీమీటర్లు కాగా, బరువు 263 గ్రాములుగా ఉంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!