Common Post Graduate Entrance Tests - 2024 Results: తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)-2024’ ప్రవేశ పరీక్షల ఫలితాలు ఆగస్టు 9న వెలువడ్డాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, సీసీగెట్‌ కన్వీనర్‌ ఆచార్య పాండురంగారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకుకార్డులు పొందవచ్చు.  రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఎడ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది జులై 6 నుంచి 16 మధ్య సీపీగెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 73,342 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 64,765 మంది పరీక్షలు రాశారు. 


సీపీగెట్ ఫలితాల ఆధారంగా.. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూహైదరాబాద్ యూనివర్సిటీలు, వాటి  పరిధిలోని 297 పీజీ కళాశాలల్లో 51 కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 44,604 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులు చేరేందుకు ముందుకొస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టులు క్రియేట్‌ చేస్తారు. ఆన్‌లైన్, డిస్టెన్స్‌ మోడ్‌లోనూ వర్సిటీ నుంచి పీజీ కోర్సులు చేసే అవకాశం కల్పిస్తున్నారు.


సీపీగెట్ 2024 ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..


➥ సీపీగెట్ ర్యాంకు కార్డుల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://cpget.tsche.ac.in/


➥ అక్కడ హోంపేజీలో కనిపించే  'Download Rank Card' లింక్ మీద క్లిక్ చేయాలి.


➥ ఆ తర్వాత వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి.


➥ అభ్యర్థులకు సంబంధించిన ర్యాంకు కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.


➥ ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.


సీపీగెట్ 2024 ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘సీపీగెట్‌ -2024’ నోటిఫికేషన్‌ మే 15న విడుదలైన సంగతి తెలిసిందే. మే 18 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఉస్మానియా యూనివర్సిటీ జులై 3న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 6 నుంచి 16 వరకు సీపీగెట్ పరీక్షలు నిర్వహించారు. సీపీగెట్‌-2024 ప్రిలిమినరీ కీ ఆన్సర్ కీని జులై 24న విడుదలైన చేశారు. జులై 25 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా ఫలితాలను విడుదల చేశారు.


సీపీగెట్ పరిధిలోని 294 కళాశాలల ద్వారా మొత్తం 51 పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 47 పీజీ కోర్సులు, 5 ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీతోపాటు.. కాక‌తీయ‌ యూనివర్సిటీ, పాల‌మూరు యూనివర్సిటీ, మ‌హాత్మాగాంధీ యూనివర్సిటీ, శాతవాహ‌న‌ యూనివర్సిటీ, తెలంగాణ‌ యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ, తెలంగాణ మ‌హిళా వ‌ర్సిటీలు సీపీగెట్ పరీక్ష ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...