తెలంగాణలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో కొత్తగా మంజూరైన 15 డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో డిగ్రీ మొదటి సంవత్సరం(ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాల ప్రకటన విడుదలైంది. వీటిలో 8 బాలుర కళాశాలలు, 7 బాలికల కళాశాలలు ఉన్నాయి. 


వివరాలు..


* డిగ్రీ కోర్సులు


1) బీఎస్సీ


2) బీకాం


3) బీఏ



మొత్తం సీట్ల సంఖ్య:
4800



జిల్లాలవారీగా కళాశాలల వివరాలు:
కరీంనగర్- కరీంనగర్: 320, ఎల్లారెడ్డిపేట్- రాజన్న సిరిసిల్ల: 320, ధర్మపురి- జగిత్యాల: 320, నిజామాబాద్- నిజామాబాద్: 320, ఖమ్మం- ఖమ్మం: 320, హైదరాబాద్- హైదరాబాద్: 320, కందుకూరు- రంగారెడ్డి: 320, మేడ్చల్- మేడ్చల్ మల్కాజిగిరి: 320, పాలకుర్తి- జనగామ: 320, స్టేషన్ ఘన్‌పూర్‌-జనగామ: 320, నాగార్జునసాగర్- నల్గొండ: 320, దేవరకద్ర- మహబూబ్ నగర్: 320, వనపర్తి- వనపర్తి: 320, మెదక్- మెదక్: 320, నిర్మల్- నిర్మల్: 320.


అర్హత: ఏప్రిల్/ మే-2022లో సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎంబీసీ విద్యార్థులు ప్రవేశానికి అర్హులు. తల్లిదండ్రులు/ సంరక్షకుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు.. పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదు.



దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.



ఎంపిక ప్రక్రియ: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా.



ఫీజు వివరాలు: మెయింటెనెన్స్ ఛార్జీలు రూ.1,000; డిపాజిట్ రూ.1,000.



ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.09.2022. 


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.10.2022.



Notification


Online Application


Online Fee Payment

Website


Also Read:


RGUKT Counselling: అక్టోబరు 12 నుంచి ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ (నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం)లలో ప్రవేశాలకు సంబంధించి అక్టోబర్ 12 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. అక్టోబరు 12 నుంచి 16 వరకు క్యాంపస్‌ల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.అక్టోబరు 12, 13 తేదీల్లో నూజివీడు, ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లలో; అక్టోబరు 14, 15 తేదీల్లో ఒంగోలు క్యాంపస్‌లో; అక్టోబరు 15, 16 తేదీల్లో శ్రీకాకుళం క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.  అక్టోబరు 17 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. 
పూర్తి కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా.. 



జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
కోర్సులు, ముఖ్యమైన తేదీల కోసం క్లిక్ చేయండి..



Pragathi Scholarship: మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌!! దరఖాస్తు చేసుకోండి, అర్హతలివే!
మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది.  ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. డిప్లొమా, డిగ్రీ కోర్సులు చదువుతున్న అర్హులైన అమ్మాయిలకు ఈ స్కీమ్ కింద ఆర్థికసాయం అందిస్తారు. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలకు మించకూడదు.  ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. సరైన అర్హతలున్న మహిళలు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలి. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా స్కాలర్‌షిప్ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..