ఇటీవల నీట్ ఎగ్జామ్ 2021 పరీక్ష జరగగా.. తాజాగా మరో పరీక్ష హాల్ టికెట్లు వచ్చేశాయ్. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JNUEE -2021) అడ్మిట్ కార్డులు విడుదల చేశారు. జేఎన్‌యూఈఈ పరీక్ష తేదీలను సెప్టెంబర్ 20 నుంచి 23 తేదీల మధ్య షెడ్యూల్ చేశారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ (Download JNUEE Admit Card) చేసుకోవాలని ఎన్‌టీఏ తెలిపింది.
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు కింది లింక్ క్లిక్ చేయండి
https://jnuexams.nta.ac.in/jnueeadmitcards2021/logintypes.aspx
విద్యార్థులు ఏమైనా సందేహాలు ఉంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హెల్ప్ డెస్క్ నెంబర్ 011-40759000లో సంప్రదించాలని లేదా ఎన్‌టీఏ సూచించిన jnu@nta.ac.inకు మెయిల్ చేయాలని సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు ప్రింటౌట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ హాల్‌కు నిబంధనల ప్రకారం హాజరు కావాలని విద్యార్థులకు తెలిపారు. అభ్యర్థులు రెండు విధాలుగా తమ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే వెసలుబాటు కల్పించారు. అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ టైప్ చేసి హాల్ అడ్మిట్ కార్డ్ పొందవచ్చు. రెండో విధానంలో.. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి అభ్యర్థులు జేఎన్‌యూఈఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Also Read: తెలంగాణలో భారీగా పెరిగిన బీటెక్ ఫీజులు.. రెగ్యులర్ కోర్సులకు రెండింతలైన రుసుము
జేఎన్‌యూఈఈ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే విధానం..
మొదటగా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ కు వెళ్లాలి JNUEE admit card 2021 Download Link
అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డు పొందవచ్చు
హాల్ టికెట్ పొందడానికి కావలసిన డిటేల్స్ ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి
స్క్రీన్ మీద మీ హాల్ టికెట్ వస్తుంది. డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలి.