TGEMR 6th class Admissions: తెలంగాణ రాష్ట్రంలోని  23 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.  బోధనా మాధ్యమం ఇంగ్లీషులో సీబీఎస్ఈ సిలబస్ బోధిస్తారు. అర్హులైన గిరిజన, ఆదివాసి గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ తదితర కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఫిబ్రవరి 16లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మార్చి 16న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు.

పరీక్ష వివరాలు..

* తెలంగాణ ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు

* ఈఎంఆర్ఎస్ సెలెక్షన్ టెస్ట్(ఈఎంఆర్ఎస్ఎస్‌టీ)- 2025

సీట్ల సంఖ్య: ప్రతి ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయంలో ఆరో తరతగతిలో 60 సీట్ల చొప్పున మొత్తం 23 విద్యాలయాల్లో 1,380(690 బాలురు, 690 బాలికలు) సీట్లు కెటాయించారు. 

జిల్లాల వారీగా ఖాళీలు..

సీరియల్ నెంబర్ జిల్లా పేరు ఇన్‌స్టిట్యూషన్బాలురు బాలికలుమొత్తం
1.ఆదిలాబాద్EMRS ఉట్నూర్303060
2.ఆసిఫాబాద్EMRS సిర్పూర్- టి303060
3.ఆదిలాబాద్EMRS నార్నూర్303060
4. భద్రాద్రి కొత్తగూడెంEMRS గండుగులపల్లి303060
5.భద్రాద్రి కొత్తగూడెంEMRS పాల్వంచ303060
6.భద్రాద్రి కొత్తగూడెంEMRS గుండాల303060
7.భద్రాద్రి కొత్తగూడెంEMRS టేకులపల్లి303060
8;నాగర్ కర్నూల్EMRS కల్వకుర్తి303060
9.మహబూబ్ నగర్EMRS బాలానగర్303060
10.మహబూబాబాద్EMRS కురవి303060
11.మహబూబాబాద్EMRS సీరోల్303060
12.మహబూబాబాద్EMRS బయ్యారం303060
13.కామారెడ్డిEMRS గాంధారి303060
14.నిజామాబాద్EMRS ఇందల్వాయి303060
15.రాజన్న సిరిసిల్లEMRS మర్రిమడ్ల303060
16.రాజన్న సిరిసిల్లEMRS యెల్లారెడ్డిపేట303060
17.ఆదిలాబాద్EMRS ఇంద్రవెల్లి303060
18.భద్రాద్రి కొత్తగూడెంEMRS చెర్ల303060
19.భద్రాద్రి కొత్తగూడెంEMRS దుమ్ముగూడెం303060
20.భద్రాద్రి కొత్తగూడెంEMRS ముల్కలపల్లి303060
21.ఖమ్మంEMRS సింగరేణి303060
22.మహబూబాబాద్EMRS కొత్తగుడ303060
23.మహబూబాబాద్EMRS గూడూరు303060
  మొత్తం6906901380

అర్హతలు:ఆరో తరతగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకొనే  విద్యార్థులు తప్పనిసరిగా 2023-24 లేదా 2024-25 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి.  విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించకూడదు.

వయోపరిమితి: 31.03.2025 నాటికి 6వ తరగతికి 10-13 సంవత్సరాల మధ్య ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల వయోసడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:రూ.100. 

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం:ఆరో తరగతికి మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ- 50 ప్రశ్నలు, అరిథ్‌మెటిక్- 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్&తెలుగు- 25 ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు… 

➥ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 16.02.2025.

➥ ప్రవేశ పరీక్ష నిర్వహణ: 16.03.2025.

➥ పరీక్ష ఫలితాల ప్రకటన: 31.03.2025.

➥ మొదటి దశ ప్రవేశాలు: 31.03.2025.

ALSO RAED:➥ Tenth Exams: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు అలర్ట్ - ప్రీ-ఫైన‌ల్ ప‌రీక్షలు ఎప్పటినుంచంటే?

Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..