Nara Lokesh In Visakhapatnam | అమరావతి: రాజకీయాల్లో పాదయాత్ర ఎంబీఏ లాంటిదని, స్టాన్‌ఫోర్డ్ లో తన చదువు వ్యాపారం చేయడానికి పనికొస్తుందని నారా లోకేష్ అన్నారు. 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువునష్టం దావా కేసులో ఏపీ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను విశాఖ ఎయిర్‌పోర్టుకు పలుమార్లు వచ్చాను. టీడీపీ ప్రభుత్వం నాపై లాంజ్‌లో రూ.25 లక్షలు ఖర్చుపెట్టిందని సాక్షిలో కథనం వచ్చింది. దీనిపై అప్పట్లోనే పరువునష్టం దావా వేశాను. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశాం. వారం తరువాత మాతో ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, రీజాయిండర్ వేస్తామన్నారు. పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని కోర్టు విచారణకు హాజరవుతున్నాను. 


ప్రభుత్వం నుంచి రూపాయి కూడా తీసుకోలేదు..


ఈరోజు కూడా మంత్రి హోదాలో విశాఖకు వచ్చినా పార్టీ ఆఫీసులో బస్సులో నిద్రించాను. అక్కడ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. వాటర్ వాటిల్స్, రవాణాకు వాహనాలు సైతం నా సొంత నగదు, నిధులు ఖర్చుపెట్టుకున్నాను. ఈ విషయం నా తల్లి నారా భువనేశ్వరి నుంచి నేర్చుకున్నాను. ఈ కేసు విచారణకు నాలుగుసార్లు హాజరయ్యాను. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతాను. నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. 


నిరంతరం ప్రజల్లో ఉంటే వారి సమస్యలు తెలుస్తాయి. ఇప్పుడు ఎవరైనా తన వద్దకు విషయం తీసుకొస్తే.. దాని వెనుక ఎంత కష్టం ఉందని క్లియర్‌గా తెలుస్తుంది. మంత్రిగా ఉండటం వల్ల రెగ్యూలర్ గా పాదయాత్రలు చేయలేం. కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, వారిని కలిసేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటాం. ప్రజల నుంచి అర్జీలు తీసుకుని వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధితో పాటు ఇటు సంక్షేమంపై ఫోకస్ చేసిందని’ నారా లోకేష్ స్పష్టం చేశారు.



Also Read: Pawan Kalyan Letter: జన సైనికులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ- వాటి జోలికి వెళ్లొద్దని కీలక సూచనలు