తెలంగాణలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నవంబరు 7న రెండోవిడత నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది ఎంసెట్ హాజరైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ నవంబరు 8న ఉదయం 8 గంటలకు ప్రారంభంకాగా.. నవంబరు 12న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. సరైన అర్హతలున్నవారు అవసరమైన అన్ని ధ్రువపత్రాలతో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. 


వివరాలు...


* బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు


అర్హతలు: 45 శాతం మార్కులతో ఇంటర్(బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్‌లో ఇంగ్లిష్ సబ్జెక్టు కచ్చితంగా చదివి ఉండాలి. టీఎస్ ఎంసెట్-2023 (మెడికల్) ఉత్తీర్ణత ఉండాలి. రెగ్యులర్/ఓపెన్ స్కూల్, ఇంటర్ ఇంటర్ ఒకేషనల్ కోర్సులు చదివినవారు కూడా అర్హులే. ఎస్సీ, ఎస్టీ బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.


వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
మెరిట్ లిస్ట్: విద్యార్హతలు, ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ఎంపికజాబితా ప్రకటిస్తారు.


రిజిస్ట్రేషన్ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.2,500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్/డెబిట్‌కార్డు/క్రెడిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు.


అవసరమయ్యే సర్టిఫికేట్లు..


➥ టీఎస్ ఎంసెట్ 2023 హాల్‌టికెట్


➥ టీఎస్ ఎంసెట్ 2023 ర్యాంక్ కార్డు


➥ బర్త్ సర్టిఫికేట్ (పదోతరగతి మార్కుల మెమో).


➥ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్కుల మెమో(ఇంటర్ లేదా తత్సమాన)


➥ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు 


➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతల సర్టిఫికేట్లు


➥ రెసిడెన్స్ సర్టిఫికేట్


➥ EWS సర్టిఫికేట్ 


➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్


➥ క్యాస్ట్ సర్టిఫికేట్


➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్


➥ ఆధార్ కార్డు


➥ అభ్యర్థి లేటెస్ట్ ఫొటోలు, సంతకం నమూనా అవసరమవుతాయి.


అభ్యర్థులకు వెబ్‌ఆప్షన్ల నమోదులో ఏమైనా టెక్నికల్ సమస్యలు ఎదురైతే: 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tsparamed2023@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.


నియమనిబంధనల్లో ఏమైనా సందేహాలుంటే: 9490585796, 7901098840 ఫోన్ నెంబర్లలో, ఇతర సమస్యలకు ఈమెయిల్: knrparamedadmission@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయి.


ఫీజు చెల్లింపు విషయంలో సమస్యలు ఎదురైతే: 9959101577 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చు.


ముఖ్యమైన తేదీలు..


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.11.2023. (08.00 A.M)


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.11.2023. (06.00 P.M)


Notification


Counselling Website


ALSO READ:


తెలంగాణ 'హార్టిసెట్‌-2023' నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఉద్యానవన డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు 'హార్టిసెట్‌-2023' నోటిపికేషన్ విడుదల చేసింది. హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా(పాలిటెక్నిక్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఎస్సీ ఆనర్స్‌ (హార్టికల్చర్) డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు నవంబరు 28లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.350 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష వివరాలు, నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...