ఏపీలోని నర్సింగ్ కళాశాలల్లో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సు రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి వెబ్‌ఆప్షన్ల నమోదుకు వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ నవంబరు 4న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ కాని 987 సీట్లు, సీటు కేటాయించినా.. చేరని విద్యార్థుల 2,578 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన 14 నర్సింగ్ కళాశాలల్లోని 390 సీట్లు కలిపి మొత్తం 3955 సీట్లకు రెండో విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. గరిష్ఠంగా ఒక్కో అభ్యర్థి ఎన్ని ఆప్షన్లు అయిన నమోదుచేసుకోవచ్చు. ఎలాంటి అవధి లేదు. సీట్లు పొందిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించి సంబంధిత కళాశాలలో చేరాల్సి ఉంటుంది. ఒకవేళ చేరని పక్షంలో సీటు కేటాయించరు. రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. 


రెండేళ్ల పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌లో.. ఇప్పటి వరకు భర్తీ కాని 220 సీట్లు, సీటు కేటాయించినా నిండని 184 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన మూడు కళాశాలల్లో 84 సీట్లు కలిపి, మొత్తం 488 సీట్లు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబరు 5న ఉదయం 10 గంటల నుంచి నవంబరు 8న రాత్రి 10 గంటల వరకు ఆప్షన్లు  నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.  అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 8978780501 , 7997710168, 9391805238, 9391805239 ఫోన్ నెంబర్లలో, టెక్నికల్ సమస్యల కోసం 7416563063,7416253073, 7013540128 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు.


2023-24 విద్యా సంవత్సరానికి వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 211 నర్సింగ్ కళాశాలు ఉండగా.. వాటిలో మొత్తం 7,158 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీకి నిర్వహించిన మొదటి విడత వెబ్‌ ఆథారిత కౌన్సెలింగ్‌లో మొత్తం 6,171 మందికి సీట్ల ప్రవేశాలు కల్పించగా.. రెండో విడత సీట్ల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీచేసింది.


వివరాలు..


➥ బీఎస్సీ నర్సింగ్ 


అర్హతలు: ఏపీఈఏపీ సెట్ 2023 ఉత్తీర్ణత ఉండాలి. 


వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.


దరఖాస్తు ఫీజు: కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.2360 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1888 చెల్లించాల్సి ఉంటుంది.


BSc (Nursing) Notification


బీఎస్సీ నర్సింగ్ వెబ్ ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి.. 


➥ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 


అర్హతలు: ఏపీఈఏపీ సెట్ 2023 ఉత్తీర్ణత ఉండాలి. 


వయోపరిమితి: 31.12.2023 నాటికి 21 - 45 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 21 - 48 సంవత్సరాల మధ్య ఉండాలి


దరఖాస్తు ఫీజు: కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.2360 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1888 చెల్లించాల్సి ఉంటుంది.


Post Basic B.Sc. (Nursing) Notification


పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ వెబ్ ఆప్షన్ల నమోదుకోసం క్లిక్ చేయండి.. 


ఎంబీబీఎస్ సెకండియన్ ఫలితాలు విడుదల..
ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎ ఫలితాలను ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబరు 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...