ఎంఎస్సీ నర్సింగ్, ఎంఈటీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి డిసెంబర్ 21 సాయంత్రం 6 గంటల వరకూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో మొదటి విడత వెబ్‌ఆప్షన్లకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలని, సీట్ల ఖాళీల వివరాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొంది.
రేపటి వరకు బీడీఎస్ వెబ్ ఆప్షన్లకు అవకాశం..తెలంగాణలోని ప్రైవేట్ డెంటల్ కాలేజీల్లో యాజమాన్య కోటా కింద బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన మాప్ అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం డిసెంబరు 19న విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండో విడత అనంతరం ఖాళీగా ఉన్న సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాల వారిగా సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు డిసెంబరు 20న సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద కేటీగిరి-బి అభ్యర్థులు రూ.20,000; కేటగిరి-సి(ఎన్‌ఆర్ఐ) అభ్యర్థులు రూ.40,000 చెల్లించాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్-2023 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షల షెడ్యూలు ఇలా!జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రెండు విడతల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది. జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సుల్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సు్ల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..