తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులు తగ్గుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిచ్చాయి. సెలవులు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించాయి. సెలవులు తగ్గుతాయని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, పాఠశాలలకి దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని, గతంలో ప్రకటించిన విధంగానే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి. సెలవుల కుదింపుపై వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని వెల్లడించారు.



భారీ వర్షాల కారణంగా జూలై 11 నుంచి 16 వరకూ వారం రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా జాతీయ సమైక్యతా దినోత్సం సందర్భంగా సెప్టెంబరు 17న ప్రత్యేక సెలవులను ప్రకటించడంతో అకడమిక్‌ క్యాలెండర్‌లో 8 రోజులు తగ్గాయి. ఈ నష్టాన్ని పూడ్చడానికి వీలుగా దసరా సెలవులను కుదించాలంటూ.. స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) డైరెక్టర్‌ రాధా రెడ్డి రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌కు ఒక లేఖను రాసినట్లు ప్రచారం జరిగింది. దసరా సెలవులను సెప్టెంబరు 26 నుంచి కాకుండా అక్టోబరు 1 నుంచి మొదలుపెట్టి అక్టోబరు 9 వరకు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. బోధన దినాల నష్టాన్ని భర్తీ చేయడానికి వీలుగా ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లోని రెండవ శనివారాల్లో (5 రోజులు) పాఠశాలలు పనిచేసే విధంగా ఆదేశాలను జారీ చేయాలని NCERT డైరెక్టర్ విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.



Also Read:
  తెలంగాణలో 15 రోజుల 'దసరా' సెలవులు, ప్రకటించిన ప్రభుత్వం!



15 రోజుల 'దసరా' సరదా..
తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు 15 రోజుల సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 8 వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది. అయితే సెప్టెంబర్ 25, అక్టోబర్ 9 ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయని . విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10న అంటే సోమవారం ప్రారంభం అవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. 


Also Read:  ఏపీలో 'దసరా' సెలవులు ప్రకటన! ఎన్నిరోజులంటే?



9,10 తరగతులకు సెలవులు తగ్గించాలని భావించినా...
ఈ సారి 9,10 తరగతులకు సెలవులు తగ్గించాలని భావిస్తున్నట్టు మొదట్లో వార్తలొచ్చాయి. దీనికి కారణం గత నెలలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ఇచ్చారు. అనుకున్న ప్రకారం దసరా సెలవులు ఇస్తే సమయానికి సిలబస్ పూర్తి కాదని.. ఆ తర్వాత పరీక్షల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోందని జోరుగా ప్రచారం సాగింది. అయితే  ప్రభుత్వం మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ప్రకటించడంతో ఆ ప్రచారానికి తెర పడింది. ఈ నేపథ్యంలో NCERT సూచనను కూడా ప్రభుత్వం తోసిపుచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.


తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఇవే..
♦ సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 8 వరకు దసరా సెలవులు (13 రోజులు). రెండు ఆదివారాలు కలిపి మొత్తం 15 రోజులు సెలవులు ఉండనున్నాయి.
♦ క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు కొనసాగనున్నాయి.
♦ జనవరి 13 నుంచి జనవరి 17 వరకు సంక్రాంతి సెలవులు.
♦ వేసవి సెలవులు ఏప్రిల్ 25‌, 2023 నుంచి జూన్‌ 11, 2023 వరకు.


 


Also Read


APOSS Admissions: ఏపీ సార్వత్రిక విద్యాపీఠంలో పదోతరగతి, ఇంటర్ ప్రవేశాలు
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ 2022-23 విద్యా సంవత్సరానికి పదోతరగతి, ఇంటర్మీడియట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. చదువుకోవాలని కోరిక వుండి వివిధ కారణాల వల్ల చదువు కొనసాగించలేనివారి కోసం ముఖ్యంగా బాలికలు, గ్రామీణ యువత, పనిచేయి స్త్రీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రత్యేక అవసరాలు గల వారికి  విద్యనందించడమే ఓపెన్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్రవేశ ప్రకటన, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read


NVS: నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి ప్రవేశాలు, పరీక్ష ఎప్పుడంటే?

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదో తరగతిలో ప్రవేశాల కోసం నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న  650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు కల్పిస్తారు. రాతపరీక్ష ఆధాంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్రవేశప్రకటన, ఎంపిక విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..