NITTTR: చండీగఢ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్(సెల్ఫ్ స్పాన్సర్డ్)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


* పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌


విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ అండ్‌ అప్లైడ్ సైన్సెస్ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్).


అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 


దరఖాస్తు ఫీజు: రూ.1000. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ/ ప్రెజెంటేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. గేట్‌/ నెట్‌ తదితర జాతీయ ఫెలోషిప్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. 


ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 20.10.2023.


Notification


Brochure


Application


Website


ALSO READ:


నిట్‌ అరుణాచల్ ప్రదేశ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, అర్హతలివే
అరుణాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ పథకం 2023-24 కింద పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్/ నెట్ స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 10లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రోగ్రామ్ వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐఐటీ భువనేశ్వర్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ పథకం 2023-24 కింద పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రోగ్రామ్ వివరాల కోసం క్లిక్ చేయండి..


తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, ఎంఎస్సీ, పీజీతో పాటు గేట్‌/ యూజీసీ- నెట్‌/ సీఎస్‌ఐఆర్‌- నెట్‌/ ఎన్‌బీహెచ్‌ఎం/ ఇన్‌స్పైర్‌లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 3లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌,  2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 1 నుంచి అక్టోబరు 7 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...