NITK: నిట్ కురుక్షేత్రలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా

NITK: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర(NITK) 2025-2027 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Continues below advertisement

NITK MBA Notification: హరియాణ రాష్ట్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర(NITK) 2025-2027 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 53 సీట్లను భర్తీచేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌ స్కోర్‌ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏదైనా నేషనల్‌ లెవెల్‌ పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మే 5లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

Continues below advertisement

ప్రోగ్రామ్‌ వివరాలు..

* మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ) 2025 - 2027 

రెగ్యులర్ సీట్ల సంఖ్య: 53 

కేటగిరీ వారీగా ఖాళీలు: ఓపీ- 21, ఓపీ(పీడబ్ల్యూడీ)- 01, ఈడబ్ల్యూఎస్- 04, ఈడబ్ల్యూఎస్(పీడబ్ల్యూడీ)- 14, ఎస్సీ- 08, ఎస్టీ- 03, ఎస్టీ(పీడబ్ల్యూడీ)- 01.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం(ఎస్సీ, ఎస్టీ 45% మార్కులతో) ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌ స్కోర్‌ కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. 

దరఖాస్తు విధానం: గూగుల్‌ లింక్‌ ద్వారా. 

ఎంపిక విధానం: ఏదైనా నేషనల్‌ లెవెల్‌ పరీక్ష(జూన్ 2024 నుంచి మే 2025) స్కోర్‌, గ్రూప్ డిస్కషన్ & పర్సనల్ ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్ ఆధారంగా. 

ఎంబీఏ సూపర్ న్యూమరరీ సీట్లు: 04

➥ డీఏఎస్‌ఏ(DASA)- 01

➥ ఐసీసీఆర్(ICCR)- 01

➥ ఎంఈఏ(MEA)- 01 

➥ ఎంఈఏ(NSS)- 01

ముఖ్యమైన అంశాలు:

➥ ఓపీ(పీడబ్ల్యూడీ) అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.

➥ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.

➥ ఎంబీఏ సూపర్‌న్యూమరరీ సీట్లు (DASA/ICCR/MEA/MEA (NSS)

➥ 2025-26 విద్యా సంవత్సరానికి MEA నేపాల్ స్కాలర్‌షిప్ స్కీమ్

స్పాన్సర్డ్ సీట్లు: 07

కేటగిరీ వారీగా ఖాళీలు: ఓపీ- 03, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 01, ఓబీసీ(పీడబ్ల్యూడీ)- 01, ఎస్సీ- 01.

ముఖ్యమైన అంశాలు:

➥ స్పాన్సర్ చేయబడిన అభ్యర్థికి ప్రవేశానికి క్యాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌ లేదా ఏదైనా నేషనల్‌ లెవెల్‌ పరీక్ష అవసరం లేదు.

➥ 1956 నాటి భారత కంపెనీల చట్టంలో విలీనం చేయబడిన రక్షణ రంగ సంస్థలు/ ప్రభుత్వ రంగ సంస్థలు/ స్వయంప్రతిపత్తి సంస్థలు (కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వం)/ ప్రైవేట్ పరిశ్రమలలో రెగ్యులర్ ఉద్యోగులు, రెండేళ్ల అనుభవం ఉన్నవారు MBA ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

➥ ప్రస్తుత 2 సంవత్సరాల ఎంబీఏ ఫీజులకు రెండు రెట్లు..

➥ స్పాన్సర్డ్ సీట్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ అడ్మిషన్ దరఖాస్తు ఫారమ్‌ను mba@nitkkr.ac.in కు మాత్రమే మెయిల్ చేయాలి.

➥ దరఖాస్తు ఫారమ్ సమర్పణకు ఇతర మార్గాలు ఏవీ అనుమతించబడవు.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 05.05.2025. 

✦ గ్రూప్‌ డిస్క్‌షన్‌, పర్సనల్ ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 08.05.2025. 

✦ గ్రూప్‌ డిస్క్‌షన్‌, పర్సనల్ ఇంటర్వ్యూ తేదీ: 19.05.2025. 

✦ మెరిట్‌ లిస్ట్‌: 20.05.2025. 

✦ మొదటి రౌండ్‌ అడ్మిషన్ కౌన్సెలింగ్‌: 21 - 22.05.2025. 

✦ రెండో మెరిట్‌ లిస్ట్‌: 23.05.2025. 

✦ రెండో రౌండ్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ (మిగిలి సీట్లకు మాత్రమే): 27.05.2025. 

Notification

Online Application

Website

Continues below advertisement
Sponsored Links by Taboola