David Warner:ఐపీఎల్‌ సీజన్‌లో మొదలై నాలుగురోజులైంది. రికార్డుల మోత మోగుతోంది. అయితే ఈ ఐపీఎల్ కారణంగా చాలా మంది విదేశీ ప్లేయర్లు మన ఇంటి వాళ్లుగా మారిపోయారు. ఇక్కడ ఫుడ్‌ను ఇష్టపడుతున్నారు. ఇక్కడ సినిమాలు చూస్తున్నారు. ఇక్కడ సంస్కృతిని ఫాలో అవుతున్నారు. అలాంటి వారి ముందుండే వ్యక్తి ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌. 

డేవిడ్ వార్నర్‌ అంటే క్రికెట్ అభిమానులే కాదు సినిమా ఫ్యాన్స్ కూడా అతన్ని ఇష్టపడతారు. కొత్తగా వచ్చే సినిమాల్లో వైరల్ అయిన కంటెంట్‌పై రీల్స్ చేయడంతో మరింత ఆకట్టుకున్నాడు వార్నర్. దీన్ని గమనించిన వెంకీ కుడుముల హీరో నితిన్‌తో తీసే రాబిన్ హుడ్ సినిమాలో ఛాన్స్ ఉచ్చారు. అందులో ఓ పాత్రలో వార్నర్‌ నటిస్తున్నాడు. ఇది క్లిక్ అయితే మరిన్ని తెలుగు సినిమాల్లో వార్నర్ కనిపించే అవకాశం ఉంది. 

ఈసారి ఐపిఎల్‌లో వార్నర్‌ ఆడటం లేదు. అక్కడ ఆయన సందడి లేకపోయినా టాలీవుడ్‌లో కనిపిస్తోంది. దీన్ని కొన్ని సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. వార్నర్‌ ఫేమ్‌ను వాడుకునేందుకు సిద్ధమయ్యాయి. లోకల్‌ బ్రాండ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు అతన్ని ఇమేజ్‌ను యూజ్ చేసుకోనున్నాయి.  అందులో భాగంగానే ప్రముఖ పెయిన్ రిలీఫ్ బ్రాండ్ ‘మై డాక్టర్’ వార్నర్‌తో ఒప్పందం చేసుకుంది. 

హీరో నితిన్‌ నటించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో నటిస్తున్న వార్నర్‌ ఆ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైడాక్టర్‌ సంస్థ వాళ్లు వార్నర్‌ను కలిశారు. తమ ప్రోడక్ట్‌ గురించి చెప్పి భాగస్వామ్యానికి ఒప్పించారు. ‘మై డాక్టర్’ డైరెక్టర్ రఘునందన్ స్వయంగా వార్నర్‌తో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మైడాక్టర్‌ బ్రాండ్‌ను ప్రమోట్ చేయనున్నారు. 

వార్నర్‌ను కలిసిన సందర్భంగా అతను సంతకం చేసిన ‘మై డాక్టర్’ పేరు ఉన్న బ్యాట్‌ను అందుకున్నారు. ఆయనతో ఫోటోలు దిగారు. వీడియోలు తీసుకున్నారు. ఇది ఓ విప్లవాత్మకమైన ఒప్పందంగా  ‘మై డాక్టర్’ సంస్థ అభిప్రాయపడుతోంది. ఇందులో సినిమా, క్రీడలు, ఆరోగ్యం మూడు సమ్మేళనంగా ఉండే ఒప్పంద న్యూ హైట్స్‌కు వెళ్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్రజాదరణ పొందిన తమ బ్రాండ్‌ ఇప్పుడు వార్నర్‌ లాంటి సెలబ్రెటీ కాంబినేషన్ మరింత సూపర్‌ హిట్ అవుతుందని అంటున్నారు. బ్రాండ్‌ ఎనర్జీ, విజిబులిటీ పెరుగుతుందని ఆశిస్తున్నారు.