దేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్‌)లలో ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (నిమ్‌సెట్) -2023' నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా... వరంగల్, అగర్తలా, అలహాబాద్, భోపాల్, కాలికట్, దుర్గాపూర్, జంషెడ్‌పూర్, కురుక్షేత్ర, రాయ్‌పూర్, సూరత్‌కల్, తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లలో ప్రవేశాలు ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి నిట్-జంషెడ్‌పూర్ పరీక్ష బాధ్యతలు చేపట్టింది. నిట్‌ల్లో ఎంసీఏ కోర్సు వ్యవధి మూడేళ్లు. అయితే నిట్, వరంగల్ రెండేళ్లు కోర్సు అనంతరం వైదొలిగే అవకాశాన్నీ కల్పిస్తోంది. రెండేళ్ల చదువు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.


పరీక్ష వివరాలు...


* నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్‌సెట్)-2023


మొత్తం సీట్ల సంఖ్య: 813.


సీట్ల వివరాలు: వరంగల్ - 58, అగర్తలా-30, అలహాబాద్-116, భోపాల్- 115, జంషెడ్‌పూర్ - 115, కురుక్షేత్ర - 96 (వీటిలో 32 సెల్ఫ్ ఫైనాన్స్), రాయ్‌పూర్- 110, సూరత్కల్-58, తిరుచురాపల్లి - 115.


అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఎస్సీ/ బీఎస్సీ/ బీసీఏ/ బీఐటీ/ బీఈ/ బీటెక్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


సీట్ల కేటాయింపు: మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తారు.


దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250. మిగిలిన అందరికీ రూ.2500.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 1000 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. రాతపరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్-50 ప్రశ్నలు-600 మార్కులు, అనలిటికల్ ఎబిలిటీ & లాజికల్ రీజనింగ్-40 ప్రశ్నలు-240 మార్కులు, కంప్యూటర్ అవేర్‌నెస్-20 ప్రశ్నలు-120 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-10 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 40 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. 


తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.


ముఖ్య తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.03.2023 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 10.04.2023. 


➥ నిమ్‌సెట్-2023 ప్రవేశ పరీక్ష తేది: 11.06.2023.


➥ నిమ్‌సెట్-2023 ఫలితాల ప్రకటన: 16.06.2023.


Notification


Online Application


Website


ALso Read:


Model School: 'మోడల్ స్కూల్స్' దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్‌లో) ప్రవేశానికి దరఖాస్తుల గడువును మార్చి వరకు పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు గడువును రెండుసార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి పొడిగించారు. ఈ మేరకు విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి దరఖాస్తు గడువు మార్చి 1తో ముగిసిన గడువును, మరో వారంరోజులపాటు పొడిగించారు. మార్చి 8 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పటివరకు 64,350 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఉషారాణి తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


TSRJC CET - 2023: టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2023–24 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియేట్​ మొదటి సంవత్సరం ఇంగ్లిష్​ మీడియం ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్​ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..