అరుణాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) విశ్వేశ్వరయ్య ఫెలోషిప్ పథకం 2023-24 కింద పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్/ నెట్ స్కోరు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 10లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


* పీహెచ్‌డీ ప్రోగ్రామ్


విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్.


అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్/ నెట్ స్కోర్ సాధించి ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ''Visvesvaraya PhD Application in the concerned department" సబ్జెక్టుగా సంబంధిత విభాగాన్ని తెలుపుతూ ఈమెయిల్ పంపాలి.


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. 


ముఖ్యమైన తేదీలు..


➥ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 10.10.2023.


➥ అభ్యర్థుల ఎంపికజాబితా: 11.10.2023.


➥ రాతపరీక్ష, ఇంటర్వ్యూ తేది: 13.10.2023.


➥ ఫలితాల వెల్లడి: 16.10.2023.


➥ ప్రవేశాలు: 19.10.2023.

ఈమెయిల్: nitapcsehod@gmail.com


Notification


Application


Website


ALSO READ:


సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీగెట్‌(కామన్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)-2023 కౌన్సెలింగ్‌కు సంబంధించి సెప్టెంబర్ 29న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో మొత్తం 45 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీటు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 4లోగా సంబంధిత కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అక్టోబర్‌ 6న ప్రారంభం కానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 2023 విద్యా సంవత్సరానికి ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌ అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 3లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, ఎంఎస్సీ, పీజీతో పాటు గేట్‌/ యూజీసీ- నెట్‌/ సీఎస్‌ఐఆర్‌- నెట్‌/ ఎన్‌బీహెచ్‌ఎం/ ఇన్‌స్పైర్‌లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 3లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...