ఆ కోర్సులకు ఏప్రిల్ 1 నుంచి ఇంటర్వ్యూలు..
బీఎఫ్ టెక్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. మరోవైపు, ఎన్‌ఐఎఫ్‌టీల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్ (మాస్టర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి 6 వరకు ఢిల్లీలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించింది. ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు ఎన్‌టీఏ హెల్ప్ డెస్క్ 011-40759000 నంబర్ లేదా nift@nta.ac.in ద్వారా తెలపవచ్చని ఎన్‌టీఏ తెలిపింది.
కోర్సు వివరాలు..
* నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రవేశాలు (NIFT - 2024)
నిఫ్ట్ క్యాంపస్‌లు: బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, దమణ్, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్‌పుర్, కాంగ్రా, కన్నూర్, ముంబయి, న్యూదిల్లీ, పట్నా, పంచకుల, రాయ్‌బరేలి, షిల్లాంగ్, శ్రీనగర్.
➥ బ్యాచిలర్ ప్రోగ్రామ్స్
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
⫸ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్(బీడీఈఎస్)
విభాగాలు: ఫ్యాషన్ డిజైన్/ లెదర్ డిజైన్/ యాక్సెసరీ డిజైన్/ టెక్స్‌టైల్ డిజైన్/ నిట్‌వేర్ డిజైన్/ ఫ్యాషన్ కమ్యూనికేషన్.
⫸ బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్) ప్రోగ్రామ్
➥ మాస్టర్స్ ప్రోగ్రామ్
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
⫸ మాస్టర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ (ఎండీఈఎస్)
⫸ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ (ఎంఎఫ్‌ఎం)
⫸ మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎంఎఫ్‌టెక్)
➥ పీహెచ్‌డీ ప్రోగ్రామ్
విభాాగాలు: డిజైన్, మేనేజ్‌మెంట్, టెక్నాలజీ.
అర్హతలు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.