నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్ డిజైన్(బీడిజైన్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
* మాస్టర్ ఆఫ్ డిజైన్
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.
సీట్ల సంఖ్య: 290. వీటిలో అహ్మదాబాద్ క్యాంపస్‌లో 107 సీట్లు, గాంధీనగర్ క్యాంపస్‌లో 88, బెంగళూరు క్యాంపస్‌లో 95 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
స్పెషలైజేషన్లు: యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ & వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్, ఫొటోగ్రఫీ డిజైన్, సిరామిక్ & గ్లాస్ డిజైన్, ఫర్నీచర్ & ఇంటీరియర్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, టాయ్ & గేమ్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ & ఆటోమొబైల్ డిజైన్, యూనివర్సల్ డిజైన్, డిజిటల్ గేబ్ డిజైన్, ఇన్‌ఫర్మేషన్ డిజైన్, ఇంటరాక్షన్ డిజైన్, న్యూ మీడియా డిజైన్, డిజైన్ ఫర్ రిటైల్ ఎక్స్‌పీరియన్స్, స్ట్రాటిజిక్ డిజైన్ మేనేజ్‌మెంట్ టెక్స్‌టైల్ & అపరెల్ డిజైన్, లైఫ్ స్టయిల్ యాక్సెసరీ డిజైన్.
అర్హత: ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా (డిజైన్/ ఫైన్ ఆర్ట్స్/ అప్లైడ్ ఆర్ట్స్/ ఆర్కిటెక్చర్) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 01.07.1992 తర్వాత జన్మించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2023.
➥ దరఖాస్తు సవరణ తేదీలు: 05.12.2023 నుంచి 07.12.2023 వరకు.
➥ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 24.12.2023.
ALSO READ:
డిగ్రీలో 'సైబర్ సెక్యూరిటీ' కోర్సు ప్రారంభం, భవిష్యత్తులో మరిన్ని కొత్త కోర్సులు
తెలంగాణలోని డిగ్రీ విద్యలో కొత్తగా 'సైబర్ సెక్యూరిటీ' కోర్సును అందుబాటులోకి తెచ్చారు. డిగ్రీ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ కోర్సును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం (సెప్టెంబరు 11న) ప్రారంభించారు. ఉపాధికి, సమాజానికి అవసరయ్యే కొత్త కోర్సులను భవిష్యత్తులో మరిన్ని ప్రవేశ పెడతామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ఉన్నత విద్యలో మూల్యాంకన పద్ధతులపై సిఫార్సులతో ఐఎస్‌బీ రూపొందించిన నివేదికను మంత్రి విడుదల చేశారు. బోధన మూస పద్ధతిలో కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికంగా ఉండాలన్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్, ఇంటర్ అర్హత చాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని 6 ప్రభుత్వ, 162 ప్రైవేటు నర్సింగ్ కళాశాలల్లో జీఎన్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ ఉత్తీర్ణులైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 16లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం సీటు కేటాయిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..