నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.


వివరాలు..


* బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌


కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు. 


సీట్ల సంఖ్య: 425 సీట్లు. వీటిలో అహ్మదాబాద్‌ క్యాంపస్‌లో 125 సీట్లు; ఏపీ, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంపస్‌లలో ఒక్కోదానిలో 75 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విదేశీ విద్యార్థులకు అదనంగా సీట్లు ఉన్నాయి.


స్పెషలైజేషన్లు: యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఎగ్జిబిషన్ డిజైన్, ఫిల్మ్ & వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్, సిరామిక్ & గ్లాస్ డిజైన్, ఫర్నీచర్ & ఇంటీరియర్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, టెక్స్‌టైల్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, టెక్స్‌టైల్ & అపరెల్ డిజైన్.


అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. 


వయోపరిమితి: 01.07.2023 తర్వాత జన్మించి ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 01.12.2023.


➥ దరఖాస్తు సవరణ తేదీలు: 05.12.2023 నుంచి 07.12.2023 వరకు.


➥ ప్రిలిమ్స్‌ పరీక్ష తేది: 24.12.2023.


➥  మెయిన్స్‌ పరీక్ష తేది: 27.04.2023.


Notification


Website


ALSO READ:


సెప్టెంబరు 16న 'USA ఎడ్యుకేషన్ ఫెయిర్', విదేశీ విద్య ఆశించేవారికి చక్కని అవకాశం
అమెరికాలో ఉన్నత విద్య ఆశించే విద్యార్థులకు ఇదొక సదావకాశం. ఓరియంట్ స్పెక్ట్రా ఆధ్వర్యంలో సెప్టెంబరు 16న ఉచిత 'USA ఎడ్యుకేషన్ ఫెయిర్' నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనే అభ్యర్థులకు 24 గంటల్లోనే ప్రవేశాలు పొందే అవకాశం కల్పించనున్నారు. ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. అదేవిధంగా ఉచిత విమాన టికెట్ పొందే అవకాశం కూడా పొందవచ్చు. విద్యార్థులకు స్కాలర్‌షిప్ అవకాశాలు కూడా కల్పించనున్నారు. ఇందుకు హైదరాబాద్,కూకట్‌పల్లిలోని హోట్ అభినందన్ గ్రాండ్ వేదిక కానుంది. సెప్టెంబరు 16న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎడ్యుకేషన్ ఫెయిర్ జరుగనుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో సర్టిఫికేట్ ప్రోగ్రామ్, అర్హతలివే!
కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, 2024-25 విద్యా సంవత్సరానికిగానను సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి. (లేదా) పీజీ (ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, మెడిసిన్, ఫార్మాస్యూటికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్)తో పాటు సంబంధిత రంగంలో మేనేజర్ స్థాయిలో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు నవంబరు 15లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...