ఎంబీబీఎస్‌ 2019 బ్యాచ్‌ ఫైనలియర్‌ విద్యార్థులకు 'నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌ (నెక్ట్స్)' వచ్చే ఏడాది రెండు దశల్లో (స్టెప్స్) ఉంటుందని అధికారవర్గాలు జూన్ 27న వెల్లడించాయి. ఢిల్లీలోని 'ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌' నిర్వహించే ఈ పరీక్షల మొదటిదశ (స్టెప్-1) 2024 ఫిబ్రవరిలో ఉండవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ఈ దశ ముగిశాక విద్యార్థులు ఒక ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌లో ఉంటారు.


మొదటిదశ  పరీక్షలో చూపిన ప్రతిభను పీజీ కోర్సుల్లో ప్రవేశానికి పరిగణనలోకి తీసుకొంటామని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌.. ఎథిక్స్‌ అండ్‌ మెడికల్‌ రిజిస్ట్రేషన్‌ బోర్డు సభ్యుడు డాక్టర్‌ యోగేందర్‌ మాలిక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్న్‌షిప్‌ తర్వాత నెక్ట్స్ రెండోదశ (స్టెప్-2)ను పూర్తి చేయాల్సి ఉంటుంది.


రెండు దశలు పూర్తిచేసినవారు భారత్‌లో ఆధునిక వైద్య ప్రాక్టీసుకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ పొందేందుకు అర్హులవుతారని చెప్పారు. విదేశాల్లో వైద్యవిద్య చదివి భారత్‌లో ప్రాక్టీసు చేయదలచినవారు సైతం ఇదేవిధంగా నెక్స్ట్‌ రెండు దశలతోపాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. నెక్స్ట్‌ మాదిరి పరీక్షలు జులై 28న నిర్వహించాలని నిర్ణయించామని, అర్హులైన విద్యార్థులు జూన్‌ 28 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.


ALSO READ:


మా కౌన్సెలింగ్‌ మేమే నిర్వహించుకుంటాం, మెడికల్ సీట్ల భర్తీపై ఎన్‌ఎంసీకి జవాబు!
ఎంబీబీఎస్, పీజీ సీట్ల భర్తీలో కామన్ కౌన్సెలింగ్‌కు తాము వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) కామన్ కౌన్సెలింగ్‌పై అభిప్రాయం కోరిన నేపథ్యంలో ఈ మేరకు ప్రత్యుత్తరం పంపింది. యథావిధిగా తామే కౌన్సెలింగ్ నిర్వహించుకుని సీట్లు భర్తీ చేసుకుంటామంది. మూడేళ్లుగా ఎన్‌ఎంసీ కామన్ కౌన్సెలింగ్‌కు ప్రతిపాదిస్తోంది. ఈ ఏడాది కూడా లేఖ రాయగా ఆ మేరకు వైద్య,ఆరోగ్యశాఖ ప్రత్యుత్తరం పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం ఆలిండియా కోటా సీట్లు మినహా మిగిలిన 85శాతం సీట్లను, ప్రైవేటు కళాశాలల్లోని 50శాతం కన్వీనర్ కోటా సీట్లను నీట్ ర్యాంకులతో భర్తీ చేస్తోంది. దీనివల్ల ఎలాంటి అవకతవకలు జరగలేదు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు - వివరాలు ఇలా!
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ), బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 31లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. 
కోర్సుల పూర్తివివరాలు, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 


తెలుగులోనూ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష! ఐఐటీ కౌన్సిల్‌లో నిర్ణయం!
జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌(జేఈఈ) అడ్వాన్స్‌డ్‌‌కు హాజరయ్యే తెలుగు విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్‌, జేఈఈ మెయిన్‌ తరహాలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షనూ తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఐఐటీ కౌన్సిల్‌, ఐఐటీ ఢిల్లీని ఆదేశించింది. ప్రధానంగా ఐఐటీల్లో డ్రాపౌట్ల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై ఐఐటీ కౌన్సిల్‌ దృష్టి పెట్టింది. డ్రాపౌట్స్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి  నివేదికను ఇవ్వాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ను కౌన్సిల్‌ ఆదేశించింది. గత ఏప్రిల్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సంబంధించిన  తీర్మానాలను కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial