నీట్ యూజీ ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను నేషనల్ టెస్టి్గ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జూన్ 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందుబాటులో ఉంచింది. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి రెస్పాన్స్ షీట్లు పొందవచ్చు. అయితే నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన ప్రొవిజినల్ ఆన్సర్ కీ త్వరలోనే విడుదల కానుంది. రెస్పాన్స్ షీట్లు విడుదలైన నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ఆన్సర్ కీ కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక జూన్ 20లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మే 7న విదేశాల్లోని 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 499 నగరాల్లో నీట్ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
మార్కుల కేటాయింపు ఇలా..
NEET UG 2023 మార్కింగ్ స్కీమ్ ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు (+4) కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు (-1) కోత విధిస్తారు. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎటువంటి మార్కు ఉండదు. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు కరెక్ట్ అని తేలితే.. సరైన ఆప్షన్‌ను గుర్తించిన వారికి నాలుగు మార్కులు ఇస్తారు. అన్ని ఎంపికలు సరైనవిగా గుర్తించినట్లయితే.. ప్రశ్నను ప్రయత్నించిన వారందరికీ నాలుగు మార్కులు ఇస్తారు.
ఈ ఏడాది కటాఫ్ ఇలా ఉండొచ్చు..
ఈ ఏడాది నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య దాదాపు 20 లక్షలుగా ఉంది. అయితే గతేడాది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీటు సాధించేందుకు 580 నుంచి 610 మార్కులు అవసరమయ్యాయి. గత సంవత్సరం కంటే ఎక్కువ కాబట్టి ఊహించిన మార్కులు 590 నుండి 620 వరకు ఉండే అవకాశం ఉంది.
Also Read:
సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్స్ విడుదల!
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జూన్ 1న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు ఇప్పటివరకు కంపార్ట్‌మెంట్ పరీక్ష అనే పేరును 'సప్లిమెంటరీ'గా మార్చారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు కూడా బోర్డు అవకాశం కల్పించింది. పదోతరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీలో భాగంగా రాసుకొనేందుకు వెసులు బాటు కల్పించిన బీసీసీఐ అధికారులు.. 12వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో మాత్రమే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 17న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 12వ తరగతి సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాలకు సంబంధించి.. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..