NEET Paper Leak Case: నీట్‌ పేపర్ లీక్‌ (NEET Row) వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై పెద్ద ఎత్తున అలజడి రేగింది. ఆ తరవాత సుప్రీంకోర్టు కూడా దీనిపై విచారణ చేపట్టింది. పేపర్ లీక్ ద్వారా ఎంత మంది లబ్ధి పొందారో గుర్తించారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. పేపర్ ఎలా లీక్ అయిందో తెలుసుకోవాల్సిన అవసరమూ ఉందని స్పష్ట చేసింది. రీటెస్ట్ అనేది చివరి ఆప్షన్‌ మాత్రమేనని వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసుని CBI విచారిస్తోంది. ఈ క్రమంలోనే కోర్టుకి CBI కీలక విషయాలు వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసుని విచారించిన సమయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "నీట్ పేపర్ సోషల్ మీడియాలో లీక్‌ అయిందా అన్నది గమనించాలి. అదే జరిగితే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది" అని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని CBI కోర్టులో ప్రస్తావించనుంది. సోషల్ మీడియాలో పేపర్ లీక్ అవ్వలేదని, కేవలం కొంత మందికే అది పరిమితమైందని వెల్లడించనుంది. ఇప్పటికే అధికారికంగా ఓ రిపోర్ట్ తయారు చేసింది. అందులో ఈ విషయాన్ని పేర్కొంది. పేపర్ లీక్ అనేది బిహార్‌లోని ఓ ఎగ్జామ్‌ సెంటర్‌కే పరిమితమైందని, అది కూడా కొంత మంది విద్యార్థులకే అందిందని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎక్కడా సర్య్కులేట్ అవ్వలేదని స్పష్టం చేసింది. వీటితో పాటు మరి కొన్ని వివరాలను ఈ రిపోర్ట్‌లో చేర్చింది. అటు కేంద్రం కూడా ఇప్పటికే ఓ అఫిడవిట్‌ని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది. ఎక్కడా మాస్ మాల్‌ప్రాక్టీస్ జరిగినట్టు ఆధారాలు లేవని వివరించింది. 


అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కూడా సుప్రీంకోర్టుకి ఈ లీక్ వ్యవహారంపై సమాధానాలు ఇచ్చింది. పట్నాలో ఎక్కడా ఎగ్జామ్‌ పేపర్ మిస్ అయినట్టు ఆధారాలు లేవని, ఎగ్జామ్‌ సెంటర్‌లలో ఎక్కడా తాళాలు పగలగొట్టిన దాఖలాలు కూడా లేవని వెల్లడించింది. ఈ కేసులో సిటీ కోఆర్డినేటర్‌తో పాటు సెంటర్ సూపరింటెండెంట్, అబ్జర్వర్స్‌ని ఇప్పటికే విచారించామని తెలిపింది. రాజస్థాన్‌లోనూ ఇలాంటి వ్యవహారమే వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో లీక్ అయిన పేపర్‌ ఒకటి బాగా వైరల్ అయింది. దీనిపై వెంటనే విచారణ చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అదేమీ లేదని వెల్లడించింది. ఎగ్జామ్ సెంటర్స్‌లో మొబైల్, ఇంటర్నెట్‌కి అనుమతి లేదని, అలా జరిగే అవకాశమే లేదని వివరించింది. జామర్స్‌ పెట్టడం వల్ల ఎక్కడా సిగ్నల్ కూడా రాదని తెలిపింది. అదే రోజున రీటెస్ట్ కండక్ట్ చేసినట్టు స్పష్టం చేసింది. 


"ఎక్కడా ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టు ఆధారాలు కనిపించడం లేదు. ప్రతి క్వశ్ఛన్‌ పేపర్‌కి ఓ యునిక్ సీరియల్ నంబర్ ఉంటుంది. తాళాలు కూడా పగలగొట్టినట్టు దాఖలాలు లేవు. అబ్జర్వర్స్‌నీ అన్ని విధాలుగా ప్రశ్నించాం. కమాండ్ సెంటర్‌లోని CC టీవీ ఫుటేజ్‌ని తరచూ పరిశీలిస్తున్నాం. పేపర్‌ లీకేజ్‌కి సంబంధించి ఎలాంటి అనుమానాస్పద ఘటనలైతే జరగలేదు"


- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 


Also Read:


Anant Radhika Wedding: అనంత్‌ అంబానీ, రాధికల మూడు రోజుల గ్రాండ్‌ వెడ్డింగ్‌- షెడ్యూల్ ఇదే