నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ ) యూజీ- 2021 పరీక్షల దరఖాస్తు గడువు నేటితో (ఆగస్టు 10) ముగియనుంది. నీట్- 2021 యూజీ రిజిస్ట్రేషన్ తేదీని ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం అభ్యర్థులు ఈ రోజు (ఆగస్టు 10) సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించడానికి రాత్రి 11.50 నిమిషాల వరకు గడువు ఉంది. దీనికి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు https://neet.nta.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 


Also Read:పిల్లలకు విలువలు, నాయకత్వ లక్షణాలతో కూడిన జీవితపాఠాలు నేర్పించే వేదిక రామయణం


కాగా, నీట్ యూజీ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ జూలై 13వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. నీట్ యూజీ పరీక్షను సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహించనున్నారు. దీనిని ఆఫ్ లైన్ విధానంలో నిర్వహిస్తారు. 


Also Read: TS CPGET 2021: ఒకే పరీక్షతో ఏడు వర్సిటీల్లో ప్రవేశాలు.. సీపీజీఈటీ నోటిఫికేషన్‌ విడుదల.. అప్లై చేసేటప్పుడు వీటిని మర్చిపోవద్దు


సవరణలకు అవకాశం.. 
నీట్ యూజీ అప్లికేషన్‌లో సవరణలకు సైతం ఎన్‌టీఏ అవకాశం కల్పించింది. అప్లికేషన్‌లో ఏమైనా తప్పులు ఉంటే.. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు సవరించుకోవచ్చని తెలిపింది. ఈసారి నీట్ పరీక్షను 13 భాషల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షను దేశంలోని 198 ప్రాంతాల్లో నిర్వహించనుంది. 


Also Read:నీట్ పీజీ రిజిస్ట్రేషన్లకు ఓకే.. అభ్యర్థులకు ఆగస్టు 20 వరకు అవకాశం


నీట్ పీజీ రిజిస్ట్రేషన్లకు ఆగస్టు 20 వరకు అవకాశం..


నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫ‌ర్ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ (నీట్ పీజీ) 2021 పరీక్ష దరఖాస్తు సవరణలకు సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటన చేసింది. నీట్ పీజీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, దరఖాస్తులలో సవరణలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. రిజిస్ట్రేషన్లు, సవరణల కోసం ఆగస్టు 16న మధ్యాహ్నం 3 నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 20 వరకు దరఖాస్తు సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. దీనికి గానూ nbe.edu.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. 


Aslo Read: NEET PG 2021: నీట్ పీజీ రిజిస్ట్రేషన్లకు ఓకే.. అభ్యర్థులకు ఆగస్టు 20 వరకు అవకాశం


Aslo Read: ఎలాంటి పరీక్షలు లేకుండానే బెల్‌లో ఉద్యోగాలు... రూ.50 వేల వరకు జీతం...