న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) దేశవ్యాప్తంగా ఉన్న 5 ప్రాంతీయ విద్యాసంస్థల్లో(ఆర్‌ఐఈ)వివిధ ఉపాధ్యాయ విద్యా సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఎన్‌సీఈఆర్‌టీ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించిన ప్రాంతీయ విద్యాసంస్థలు అజ్మీర్‌, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్‌లలో ఉన్నాయి.


కోర్సుల వివరాలు...


➥ బీఎడ్ (రెండేళ్లు)- అజ్‌మేర్‌, భువనేశ్వర్, భోపాల్, మైసూర్, షిల్లాంగ్


➥ బీఎస్సీ బీఈడీ (నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు)- భువనేశ్వర్, మైసూరు


➥ బీఏ బీఈడీ (నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్)- భువనేశ్వర్, మైసూరు


➥ ఎంఎస్సీఈడీ (ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్)- మైసూరు


➥ బీఈడీ-ఎంఈడీ(మూడేళ్లు)- భోపాల్


➥ ఎంఈడీ(రెండేళ్లు)- అజ్‌మేర్‌, భువనేశ్వర్, భోపాల్, మైసూర్ 


అర్హత: +2/ హయ్యర్ సెకండరీ/ సీనియర్ సెకండరీ, డిగ్రీ, పీజీ, బీఈడీ.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.


పరీక్ష రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.1200; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.600.


ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ తదితరాల ఆధారంగా.


ముఖ్యమైన తేదీలు…


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు తేదీలు: 25/04/2023 నుంచి 06/06/2023 వరకు.


➥ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీలు: 25/06/2023 నుంచి 02/07/2023 వరకు.


➥ ప్రవేశ పరీక్ష తేదీ:  02/07/2023.


➥ బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, ఎంఎస్సీఈడీ పరీక్ష ఫలితాల ప్రకటన: 20/07/2023.


➥ బీఈడీ, బీఈడీ ఎంఈడీ(ఇంటిగ్రేటెడ్)/ ఎంఈడీ పరీక్ష ఫలితాల ప్రకటన: 25/07/2023.


Information Brochure


Online Registration


Website


Also Read:


టీఎస్ఈసెట్-2023 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల‌కు డిప్లొమా విద్యార్థులకు నిర్వహించే టీఎస్ ఈసెట్‌-2023 దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. మే 2తో దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ మే 8 వ‌ర‌కు ఎలాంటి ఆలస్య రుసుములేకుండా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే రూ.500 ఆల‌స్యం రుసుంతో మే 11 వ‌ర‌కు, రూ.1000 ఆల‌స్యం రుసుంతో మే 13 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ద‌ర‌ఖాస్తుల‌ను మే 8 నుంచి మే 13 వ‌ర‌కు ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. మే 16 నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. మే 20న ఈసెట్ ప్రవేశ ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. ఈసెట్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సు్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 
ఈసెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


టీఎస్ ఎంసెట్-2023 హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇంటర్ (క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్) హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ & మెడికల్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక మే 12-14 మధ్య ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. 
ఎంసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..