నీట్ పీజీ 2024 దరఖాస్తు ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఏప్రిల్ 16న ప్రారంభించింది. అభ్యర్థులు మే 6 వరకు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 23న నీట్ పీజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మే 10 నుంచి 16 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. అదేవిధంగా మే 28 నుంచి జూన్ 3 వరకు మొదటి దశలో (ప్రీఫైనల్ ఎడిట్ విండో), జూన్ 7 నుంచి 10 వరకు రెండో దశలో (ఫైనల్ ఎడిట్ విండో) దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం (ఫొటో, సంతకం, వేలిముద్ర మార్పు) ఇవ్వనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 18న విడుదల చేయనున్నారు. జూన్ 23న పరీక్ష నిర్వహించి, జులై 15న ఫలితాలను వెల్లడించనున్నారు. నీట్ పీజీ 2024 ప్రవేశపరీక్ష ద్వారా ఎండీ/ఎంఎస్/పీజీ డిప్లొమా కోర్సు్లో ప్రవేశాలు కల్పి్స్తారు. పోస్ట్ ఎంబీబీఎస్ డీఎన్‌బీ కోర్సులు, ఆరేళ్ల డీఆర్‌ఎన్‌బీ కోర్సులు, పోస్ట్ ఎంబీబీఎస్ ఎన్‌బీఈఎంఎస్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
* నీట్ పీజీ - 2024 ప్రవేశ పరీక్ష (NEET PG - 2024)
అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజినల్ ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ప్రకారం శాశ్వత లేదా తాత్కాలిక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
పరీక్ష ఫీజు: రూ.3500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2500 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పీజీ ప్రవేశ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌లో మాత్రమే ప్రశ్నలు ఉంటాయి.
అర్హత మార్కులు: పరీక్షలో అర్హత మార్కులను జనరల్/ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్, జనరల్(PwD) అభ్యర్థులకు 50 పర్సంటైల్, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (PwD కలిపి) అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా మొత్తం 259 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అమలాపురం, అమరావతి, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్, కడప, కాకినాడ, కరీంనగర్, కావలి, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్గొండ, నంద్యాల, నెల్లూరు, నిజామాబాద్, ఒంగోలు, రాజంపేట, సత్తుపల్లి, సిద్ధిపేట, సూరంపాలెం, సూర్యాపేట, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వరంగల్.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16.04.2024.
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 06.05.2024 (11:55 PM)
➥ దరఖాస్తుల సవరణ: 10.05.2024 - 16.05.2024.
➥ దరఖాస్తుల సవరణకు చివరి అవకాశం (ఫొటో, సంతకం, వేలిముద్ర): 28.05.2024 - 10.06.2024.
➥ అడ్మిట్ కార్డుల విడుదల: 18.06.2024.
➥ పరీక్ష తేది: 23.06.2024.
పరీక్ష సమయం: ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.
(ఉదయం 8.30 గంటల తర్వాత అనుమతించరు)
➥ ఫలితాల వెల్లడి: 15.07.2024.
➥ ఇంటర్న్‌షిప్ కటాఫ్ తేదీ: 15.08.2024.
NEET-PG 2023 Information Bulletin
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..