JEE Main 2024: జేఈఈ మెయిన్‌ 2024 (సెషన్‌-2) పరీక్షలకు సంబంధించిన తుది ఆన్సర్ ‘కీ’ ని నేషనల్‌ టెస్టింగ్‌ఏజెన్సీ (NTA) ఏప్రిల్ 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 12న విడుదల చేసిన ప్రాథమిక కీపై ఏప్రిల్ 14 వరకు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత.. ఏప్రిల్ 22న ఫైనల్ ఆన్సర్ కీని ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్ సెషన్‌-2 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.


జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన స్కోరుల్లో మెరుగైన దానిని పరిగణనలోకి తీసుకొని మెరిట్‌ జాబితాను ఎన్టీఏ త్వరలో విడుదల చేయనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్‌ 25న జేఈఈ మెయిన్ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. అయితే కానీ అంతకంటే ముందుగానే ఫలితాలు వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


 JEE (Main)-2024: Session-2 Final Answer Key 


 ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 12,95,617 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 12,25,529 మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.


ఏప్రిల్ 27 నుంచి JEE అడ్వాన్స్‌డ్ దరఖాస్తులు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 27 నుంచి ప్రారంభంకానుంది. మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకరం మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష యథాతథంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 జరుగనుంది. జూన్ 2న ప్రాథమిక కీ విడుల చేసి, జూన్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూన్ 9న ఫైనల్‌కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఆర్కిటెక్చర్ ఆప్టిడ్యూట్ టెస్ట్ (AAT)-2024 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9 నుంచి ప్రారంభంకానుంది. జూన్ 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నారు.


జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ప్రాక్టీస్ టెస్టులు అందుబాటులో..
దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడే ప్రాక్టీస్‌ టెస్టులు అందుబాటులో వచ్చాయి. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు మద్రాస్‌ ఐఐటీ ప్రాక్టీస్‌ టెస్టులను అందిస్తోంది. పేపర్ 1 మరియు పేపర్ 2 కోసం మాక్ టెస్ట్‌లను jeeadv.ac.inలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ప్రాక్టీస్ పరీక్షల ద్వారా అభ్యర్థులు JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష యొక్క క్లిష్ట స్థాయిని అంచనా వేయవచ్చు. ప్రశ్నల తీరుపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులలో విశ్వాసాన్ని పెంచడంలో నమూనా పరీక్షలు సహాయపడతాయి.


పేపర్-1 ప్రాక్టీస్ టెస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పేపర్-2 ప్రాక్టీస్ టెస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


JEE (Advanced) 2024  Schedeule


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...