How to Keep Cars Cool in Summer: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతమైన స్థాయిలో ఉన్నాయి. ఎండ వేడిమి కారణంగా వాహనాలు సైతం బాగా వేడెక్కిపోతున్నాయి. వేసవిలో మీ కారును చల్లగా, ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. వేసవి కాలంలో కారును సరిగ్గా చూసుకోవడానికి అవసరమైన టిప్స్ తెలుసుకుందాం.


కారును ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి
అన్నింటిలో మొదటిది ఏంటంటే మీ కారు సరిగ్గా నడుస్తుందో లేదో చెక్ చేయండి. ఇది సరిగ్గా పనిచేయకపోతే మీరు ఒకసారి దాని కూలెంట్‌ను మార్చడానికి ప్రయత్నించాలి. కూలెంట్‌ను అవసరమైనప్పుడల్లా మార్చడం ద్వారా కారు ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. అలాగే కారు త్వరగా వేడెక్కదు.


కూలెంట్‌ను తనిఖీ చేయడం అవసరం
రేడియేటర్‌లో కూలెంట్ అవసరమైన స్థాయిలో లేకపోతే ఇంజిన్ త్వరగా వేడెక్కుతుంది. అటువంటి పరిస్థితిలో బోనెట్ నుండి పొగ రావచ్చు. ఇంజన్ హీటింగ్ వల్ల కారు లోపల వేడి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ముందుగా కూలెంట్‌ను చెక్ చేయాలి. అవసరాన్ని బట్టి కూలెంట్‌ను నింపుకుంటూ ఉండాలి.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది 


కారు విండోస్‌ను కొద్దిగా కిందికి ఉంచాలి
బలమైన సూర్యకాంతిలో కారు క్యాబిన్ వేడెక్కకుండా ఉండాలంటే కారు విండోస్‌ను కొద్దిగా కిందికి దించి ఉంచాలి. తద్వారా గాలి క్యాబిన్ గుండా వెళుతుంది. లోపల ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది.


నీడ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయండి
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎండలో పార్క్ చేస్తే కారు చాలా ఎక్కువగా వేడెక్కుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు కారును పార్క్ చేయాలంటే నీడ ఉన్న ప్రదేశంలో పార్క్ చేయండి. దీని వల్ల క్యాబిన్ లోపల ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది.


పిల్లలను కారులో వదలకండి
పార్క్ చేసిన వాహనంలో పిల్లలను లేదా జంతువులను ఒంటరిగా ఉంచవద్దు. పార్క్ చేసిన వాహనం లోపల ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది. అది వాటికి మరింత ప్రమాదంగా మారుతుంది.



Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు