Vasuki Indicus Snake: 2005లో గుజరాత్‌లో గుర్తించిన పాము శిలాజాల గురించి పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ భూమిపైన తిరిగిన అత్యంత భారీ పాము ఇదేనని తేల్చిచెప్పారు. దీనికి Vasuki indicus అనే పేరు కూడా పెట్టారు. 4.7 కోట్ల సంవత్సరాల క్రితం (47 million years snake) ఈ పాము జీవించిందని కచ్ అడవుల్లో సంచరించిందని తెలిపారు. ఈ పాము పొడవు 36-50 అడుగుల పొడవు ఉండొచ్చని అంచనా వేశారు. అంతరించిపోయిన Titanoboa జాతి పాములకు ఈ వాసుకి ఇండికస్‌కి తరవాతి తరం పాములు అయ్యుంటాయని అభిప్రాయపడుతున్నారు. దీని పొడవు 42 అడుగుల కన్నా ఎక్కువ ఉండొచ్చని చెబుతున్నారు. వెయ్యి కిలోల బరువు ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన, బతికున్న పాము పైథాన్. దీని పొడవు 33 అడుగులు. శిలాజాల ఆధారంగా ఇది చాలా నెమ్మదిగా కదిలేదని గుర్తించారు. అనకొండ, పైథాన్స్‌లాగానే ఈ పాములు కూడా క్షణాల్లో వేటాడి తినేవని వివరించారు. ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయిలో ఉన్న ఆ సమయంలో చిత్తడి నేలల్లో చల్లదనం కోసం ఈ పాము తిరిగి ఉంటుందని చెబుతున్నారు. అయితే...హిందూ పురాణాల ప్రకారం శివుని మెడలో (Vasuki Snake) ఉన్న పాము పేరు వాసుకి. అందుకే ఈ అరుదైన పాముకి ఆ పేరు పెట్టారు. వాసుకి అంటే పాములకు రారాజు. అది చాలా భారీగా ఉంటుందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు గుర్తించిన పాము కూడా భారీగా ఉండడం వల్ల అదే పేరు పెట్టారు.
దాదాపు 20 ఏళ్లుగా ల్యాబ్‌లోనే
ఈ వాసుకి ఇండికస్ పాము శిలాజాలను IIT-Roorkee paleontology ప్రొఫెసర్ సునీల్ బాజ్‌పాయ్ కనుగొన్నారు. 2005లో ఓ కచ్‌లోని బొగ్గు గనిలో వీటిని గుర్తించారు. అయితే...ముందు వాటిని మొసలి శిలాజాలుగా భావించారు సునీల్. ఆయన తన లేబరేటరీలో పరిశోధన చేసేందుకు 2022 వరకూ అక్కడే ఉంచారు. ఆ తరవాత దత్త అనే మరో సైంటిస్ట్ ఆ ల్యాబ్‌లో పని చేసేందుకు వచ్చారు. ఇద్దరూ కలిసి ఈ శిలాజాలపై పరిశోధన చేపట్టారు. అప్పుడే ఇది మొసలి శిలాజాలు కావని, మరింకేదో అని గుర్తించారు. Titanoboa పాముకి దగ్గరి పోలికలు కనిపించినట్టు తెలిపారు. రెండింటి ఆకారంలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ ఆ జాతికి కొనసాగింపుగానే ఈ పాములు పుట్టుకొచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.
"2005లో నేనీ శిలాజాలను గుర్తించాను. కానీ అప్పటి నుంచి నేను ఇతరత్రా పరిశోధనలతో బిజీగా ఉన్నాను. చాలా కాలంపాటు అధ్యయనం చేసిన ఆ తరవాత ఆపేశాను. 2022లో దత్త వచ్చిన తరవాత ఇద్దరం కలిసి మళ్లీ పరిశోధనలు మొదలు పెట్టాం. ముందు ఇది మొసలి శిలాజాలు అని భావించినా ఆ తరవాతే ఇవి పాము శిలాజాలు అని గుర్తించాం. ఈ భూమిపైనే అత్యంత భారీ పాము శిలాజాలు అని తేలింది. అందుకే వాసుకీ ఇండికస్ అనే పేరు పెట్టాం"
- సునీలా బాజ్‌పాయ్, పరిశోధకుడు
Also Read: మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగిపై కస్టమర్ దాడి,ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు