తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సీయూఈటీ - 2022 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సుల వివరాలు.. సీట్ల సంఖ్య: 682 సీట్లు1) శాస్త్రి: 616 సీట్లు 2) బీఏ ఆనర్స్: 22 సీట్లు 3) బీఎస్సీ కంప్యూటర్: 22 సీట్లు 4) బీఎస్సీ యోగా: 44 సీట్లు అర్హత: సంబంధిత సబ్జెక్టులలో 10+2/ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. సరైన సీయూఈటీ- 2022 స్కోరు ఉండాలి. వయసు: కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో విధానంలో దరఖాస్తు చేయాలి. ఎంపిక విధానం: సీయూఈటీ-2022 స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.200. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. ముఖ్యమైన తేదీలు.. ♦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.09.2022. ♦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.10.2022. Notification Online Application Website
Also Read: జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్ టైమ్ పీజీ కోర్సులు, చివరితేది ఎప్పుడంటే?హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి ఎంటెక్, ఎంబీఏ పార్ట్‌టైమ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబరు 17 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబరు 15 నుంచి 17 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read: అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశాల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబరు 30 వరకు ప్రవేశాల దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే రెండుసార్లు దరఖాస్తు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థులు అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. అయితే రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సెప్టెంబరు 30 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.కోర్సులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..