పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
➥ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్
మొత్తం సీట్లు: 180.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్-2023, ఎక్స్‌ఏటీ-2024, సీమ్యాట్-2024 స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 01.07.2024 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్‌సీ అభ్యర్థులకు 28 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్, క్యాట్-2023/ ఎక్స్‌ఏటీ-2024/ సీమ్యాట్-2024 స్కోరు, పని అనుభవం, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.11.2023.
ALSO READ:
ఆంధ్రా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ 2023-24 విద్యా సంవత్సరానికిగాను మూడేళ్లు, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెల్ఫ్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ కింద ఈ సీట్లను భర్తీచేయనున్నారు. ఈ కోర్సులను డా.బీఆర్ అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా నిర్వహిస్తుంది. మూడేళ్ల లా డిగ్రీ కోర్సుకు డిగ్రీ అర్హత, అయిదేళ్ల లా డిగ్రీ కోర్సుకు ఇంటర్ అర్హత ఉండాలి. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..
ఓయూలో దూరవిద్య ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య కేంద్రంలో డిగ్రీ, పీడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం ఉందని డైరెక్టర్ ప్రొఫెసర్ బీబీ రెడ్డి తెలిపారు. యూకేపీ ఆదేశాల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అక్టోబరు 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..