హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్) పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. రూ.1200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.అభ్యర్థులు డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. క్యాట్-2023 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, అకడమిక్ రికార్డ్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు. 


కోర్సు వివరాలు.. 


* పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్)


అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(అగ్రికల్చర్ సైన్సెస్/ అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌-2023 ఉత్తీర్ణత ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: క్యాట్-2023 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, అకడమిక్ రికార్డ్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.12.2023.


Notification


Online Application


Website


ALSO READ:


JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!
దేశవ్యాప్తంగా 650 జవహర్‌ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో 11వ తరగతిలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లావాసి అయి ఉండాలి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...