NEST 2024 Notification: భువ‌నేశ్వర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ & రిసెర్చ్ (నైస‌ర్), యూనివ‌ర్సిటీ ఆఫ్ ముంబ‌యి ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎన‌ర్జీ సెంట‌ర్ ఫ‌ర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్) సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'నేష‌న‌ల్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్) 2024' నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభంకాగా.. మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తు ఫీజుగా జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళా అభ్యర్థులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది.


ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైసర్), భువనేశ్వర్; యూనివర్సిటీ ఆఫ్ ముంబయి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే ఏడాదికి రూ.60,000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనం అందుకోవచ్చు. అలాగే వేసవిలో ఇంటర్న్‌షిప్ కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున గ్రాంట్ ఇస్తారు. 


వివరాలు..


🔰 నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2024


సీట్ల సంఖ్య: 257 


➥ నైసర్‌లో 200, సీఈబీఎస్‌లో 57 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కోర్సులు అందిస్తున్నారు. 


➥ నైసర్‌లో సీట్ల కేటాయింపు: జనరల్- 101, జనరల్ ఈడబ్ల్యూఎస్- 0, ఓబీసీ ఎన్‌సీఎల్- 54, ఎస్సీ- 30, ఎస్టీ- 15, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు.


➥ సీఈబీఎస్ సీట్ల కేటాయింపు: జనరల్- 23, జనరల్ ఈడబ్ల్యూఎస్- 06, ఓబీసీ ఎన్‌సీఎల్- 15, ఎస్సీ- 09, ఎస్టీ- 04, దివ్యాంగులకు ప్రతి కేటగిరీలో 5% సీట్లు కేటాయించారు.


అర్హతలు:


➥ 2022 లేదా 2023లో ఇంటర్ సైన్స్ గ్రూప్‌లతో ఉత్తీర్ణులై ఉండాలి. 2023లో ఇంటర్ పరీక్షలకు హాజరైనవారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


➥ ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌ సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.


వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి వర్తించదు.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ప్రవేశాలు పొందిన విద్యార్థులు అన్ని సెమిస్టర్లలో చూపే ప్రతిభ ఆధారంగా బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) ట్రైనింగ్ స్కూల్‌లో పరీక్ష రాయకుండానే ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అనుమతి లభిస్తుంది. ఇలా ఎంపికైనవారు శిక్షణ అనంతరం బార్క్‌లో ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్, ఓబీసీల‌కు రూ.1,400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మ‌హిళా అభ్యర్థులు రూ.700 చెల్లిస్తే సరిపోతుంది.


పరీక్ష విధానం..


➥ పరీక్ష రెండు సెషన్లలో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌లోనే ప్రశ్నలు అడుగుతారు. 


➥ పరీక్షలో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. అన్ని సెక్షన్లలోనూ కనీస మార్కులు సాధించడం తప్పనిసరి. 


➥ సెక్షన్-1 నుంచి 4 వరకు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కులు ఉంటాయి. 


➥ ఒక్కో సెక్షన్‌కు 60 మార్కులు కేటాయించారు. ఈ నాలుగింటిలో ఎక్కువ మార్కులు సాధించిన మూడు సెక్షన్ల స్కోరు కలిపి మెరిట్‌లిస్ట్ తయారుచేస్తారు. దీని ప్రకారం మొత్తం 180 మార్కుల్లో అభ్యర్థులు సాధించిన స్కోర్ పర్సంటైల్ విధానంలో లెక్కిస్తారు. 


➥ కనీసం అర్హత మార్కులను జనరల్ అభ్యర్థులకు 95; ఓబీసీలకు 90; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 75 పర్సంటైల్‌గా నిర్ణయించారు. 


➥ అర్హుల జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను కోర్సుల్లోకి తీసుకుంటారు.


➥ దేశవ్యాప్తంగా 120కి పైగా నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. విద్యార్థులు ప్రాధాన్యా ప్రకారం 5 పరీక్ష కేంద్రాలు ఎంచుకోవాలి.


ముఖ్యమైన తేదీలు..


✯ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.03.2024.


✯ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.05.2024. 


✯ అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: 15.06.2024.


✯  పరీక్ష తేదీ: 30.06.2024.


✯  ఫలితాల ప్రకటన: 10.07.2024.


Notification


Website