NEET PG 2025 Date: నీట్‌ పీజీ-2025 పరీక్ష తేదీని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NBEMS) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్‌ 15న పరీక్ష నిర్వహించనున్నారు. ఒకే షిఫ్టులో కాకుండా ఈసారి రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహణకు NBEMS ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(CBT) నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. నీట్ పీజీ 2025 పరీక్షకు హాజరయ్యే జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు 3500 రూపాయలు ఫీజు చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులయితే 2500 రూపాయలు చెల్లించాలి. 


ఒకే షిఫ్టులో పరీక్షపై చర్చ..
అంతకుముందు నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలనే నిర్ణయంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. మేధావులు, డాక్టర్లు, విద్యార్థుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. నీట్ పీజీ పరీక్షను రెండు దశల్లో నిర్వహించాలని చూడటం సరైంది కాదని వారు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల అన్‌ఫెయిర్ స్కోరింగ్, న్యాయపరమైన వివాదాలు, అభ్యర్ధుల్లో ఒత్తిడి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అదే తప్పుల్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకే షిఫ్ట్‌లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు యునైటెడ్ డాక్టర్స్ ఫోరమ్ లేఖ రాసింది. 


నీట్ పీజీ పరీక్ష విధానం..
నీట్ పీజీ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పరీక్షలో మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.


ముఖ్యమైన తేదీలు..


✦ నీట్ పీజీ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ నుంచి. 


✦ దరఖాస్తుల సమర్పణకు చివరితేదీ: మే మూడో వారం.


✦ అడ్మిట్ కార్డుల జారీ: జూన్ 2వ వారంలో 


✦ నీట్ పీజీ 2025 పరీక్ష: జూన్ 15న.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..