Seema Haider: పబ్జీలో పరిచయం అయిన ప్రేమ జంట సీమా హైదర్, సచిన్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులు అయ్యారు. ఇప్పటికే ఆమెకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు సచిన్‌తో మరో బిడ్డను కనింది. అప్పట్లో ఈ జంట సంచలనంగా మారింది. ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.  


పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి సచిన్ మీనాను ప్రేమ వివాహం చేసుకున్న సీమా హైదర్ ఇవాళ(మార్చి 18) ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె న్యాయవాది ఎ.పి. సింగ్ వెల్లడించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు ప్రకటించారు.  సీమా ఐదోసారి తల్లి కాగా, సచిన్‌తో ఆమెకు ఇది మొదటి సంతానం.


పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్‌ పబ్జీలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన సచిన్‌తో పరిచయం ఏర్పడింది. ఇరువురు పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. సచిన్ లేకుండా ఉండలేనంటూ ఆమె పాకిస్తాన్‌ను నుంచి ఇండియాకు వచ్చేసింది. దీంతో ఆమె టాక్‌ ఆఫ్‌ది కంట్రీ అయిపోయారు. 


ఆన్‌లైన్‌లో ప్రేమ కోసం ఇండియా వచ్చేసిన సీమాకు అప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. వాళ్లను అక్కడే వదిలేసి సచిన్ కోసం నొయిడా వచ్చారు. ఇక్కడ అనేక ఇబ్బందులు పడ్డారు. అయినా సరే సచిన్‌ను మాత్రం విడిచి పెట్టలేదు.  


ఇలా ప్రేమ కోసం పాకిస్తాన్ నుంచి వచ్చేసిన సీమాను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆమెపై కేసు పెట్టి జైల్లో వేసింది. చివరకు బెయిల్‌పై విడుదలైంది. 


బెయిల్‌పై విడుదలైన సీమా, సచిన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని నొయిడాలో కాపురం పెట్టారు. ఇప్పుడు వారి కాపురానికి గుర్తుగా పండంటి బిడ్డ జన్మించింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సీమా ఆడపిల్లకు జన్మనిచ్చింది. సోషల్ మీడియాలో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. 


ప్రస్తుతం ఈ సచిన్, సీమా జంట యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారు. ఐదుకుపైగా ఛానల్స్ రన్ చేస్తున్నారు. దీని వల్ల లక్షల్లో ఆదాయం వస్తున్నట్టు చాలా వీడియోల్లో సీమా చెప్పుకొచ్చారు. ఇండియా వచ్చిన తర్వాత ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గడిపిన ఆనంద క్షణాలు కుటుంబంలో తరచూ వచ్చే సమస్యలు, తగాదాలు అన్నింటినీ ఈ యూట్యాబ్ ఛానల్స్‌లో షేర్ చేస్తుంటారు.