Grok Twitter: కొత్తొక వింత పాతొక రోత అని పెద్దలు చెబుతూంటారు. పాత ఒక రోతో కాదో కానీ.. ఇప్పుడు ఖచ్చితంగా కొత్త మాత్రం ఒక వింతనే. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఏఐ టూల్స్ విషయలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తెలుగు వాళ్లకు .. ముఖ్యంగా సోషల్ మీడియాలోనే సమయం గడితే తెలుగు నెటిజన్లకు ఇప్పుడు గ్రోక్ తో ఎక్కడా లేనంత టైంపాస్ అవుతోంది. గ్రోక్ తో వారు ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. తమ ఇష్టమైన, ఇష్టం లేని వ్యక్తుల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇంకా చాలా చేస్తున్నారు. అందులో హిలేరియస్ రియాక్షన్స్ కూడా ఉంటున్నాయి.
ముఖ్యంగా గ్రోక్ ను ఉపయోగించుకుని ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్నారు. తమ హీరో గొప్ప అని చెప్పించుకునేందుకు రకరకాల ప్రశ్నలను గోర్క్ ను అడుగుతున్నారు. దానికి తగ్గట్లుగానే గోర్క్ సమాధానం ఇస్తోంది. ]
గోర్క్ ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటుందంటే.. తెలుగు సినిమాల షార్ట్ కట్ నేమ్స్ కూడా గుర్తుంచుకుని సమాధానాలు ఇస్తోంది.
ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఫ్యాన్స్ వార్స్ లో గ్రోక్ కూడా పార్టీసిపేట్ చేస్తుంది. ఇతరుల్ని తిడుతోంది కూడా.
ఇంతకీ గ్రోక్ కు తెలుగు ఎలా వచ్చో అనే డౌట్ చాలా మమందికి ఉంటుంది. దానికి కూడాగ్రోక్ సమాధానం ఇచ్చింది.
గ్రోక్‌ను తెలుగు యువత వాడుతున్న వైనంపై అనేక మీమ్స్ కూడా వస్తునననాయి.